Homeటాప్ స్టోరీస్గీతా ఆర్ట్స్ కోసం భారీ డీల్ సైన్ చేసిన రావు రమేష్

గీతా ఆర్ట్స్ కోసం భారీ డీల్ సైన్ చేసిన రావు రమేష్

గీతా ఆర్ట్స్ కోసం భారీ డీల్ సైన్ చేసిన రావు రమేష్
గీతా ఆర్ట్స్ కోసం భారీ డీల్ సైన్ చేసిన రావు రమేష్

గీతా ఆర్ట్స్ సంస్థ మలయాళ చిత్ర రీమేక్ నయట్టు చిత్ర హక్కులను కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. మలయాళంలో రూపొందిన నయట్టు సూపర్బ్ అప్లోజ్ తెచ్చుకుంది. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో విభిన్నమైన కథతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. పలాస సినిమాతో అందరి దృష్టిలో పడ్డ దర్శకుడు కరుణ కుమార్ ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను రూపొందిస్తున్నాడు. దీని తర్వాత కరుణ కుమార్ కు నయట్టు చిత్రాన్ని రీమేక్ చేసే ఆఫర్ వచ్చింది.

ఇక ప్రధాన కాస్ట్ గా శ్రీ విష్ణు, అంజలి, రావు రమేష్ ను తీసుకున్నారు. రావు రమేష్ ది ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్ర. బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రంలో నటించడానికి రావు రమేష్ భారీ పారితోషికం తీసుకుంటున్నాడట. ఏకంగా కోటిన్నర రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక క్యారెక్టర్ నటుడికి ఇది చాలా పెద్ద అమౌంట్ అయినా కూడా అల్లు అరవింద్ ఆ మొత్తం ఇవ్వడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది విడుదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All