Homeటాప్ స్టోరీస్కేజిఎఫ్ అధీరా పోస్టర్: విలన్ అంటే ఇలానే ఉండాలిగా!

కేజిఎఫ్ అధీరా పోస్టర్: విలన్ అంటే ఇలానే ఉండాలిగా!

కేజిఎఫ్ అధీరా పోస్టర్: విలన్ అంటే ఇలానే ఉండాలిగా!
కేజిఎఫ్ అధీరా పోస్టర్: విలన్ అంటే ఇలానే ఉండాలిగా!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. కన్నడ ఇండస్ట్రీలోనే కాక యావత్ భారతదేశంలోనే ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు పార్ట్ 2 మరింత ఘనంగా ఉండబోతోందని అర్ధమవుతోంది. కేజిఎఫ్ చాప్టర్ 2 విషయంలో ఏ స్థాయి బజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

కన్నడ రాక్ స్టార్ యష్ ఈ చిత్రంలో హీరోగా, రాకీ భాయ్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్రకు ధీటుగా అధీరా పాత్రను పార్ట్ 2లో పరిచయం చేయనున్నాడు. సంజయ్ దత్ ఈ పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా కేజిఎఫ్ మేకర్స్ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేసారు.

- Advertisement -

విలన్ అంటే ఇలానే ఉండాలి అన్నట్లుగా సంజయ్ దత్ లుక్ ను డిజైన్ చేసారు. ఈ లుక్ స్టన్నింగ్ గా ఉందనే చెప్పాలి. రాకీ భాయ్ ను ఢీకొట్టాలంటే ఈ మాత్రం ఉండాలిగా మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All