Homeటాప్ స్టోరీస్`కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` టీజ‌ర్‌ వ‌చ్చేది అప్పుడే!

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` టీజ‌ర్‌ వ‌చ్చేది అప్పుడే!

 

KGF 2 teaser release date locked
KGF 2 teaser release date locked

కేజీఎఫ్ ఒకే ఒక్క సినిమా హీరో య‌ష్ పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. తొలి భాగం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో మేక‌ర్స్ తాజాగా చాప్ట‌ర్ 2ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ దేశ వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ఎప్పుడెప్పుడు రాబోతోందా? అని అంతా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఇటీవ‌ల య‌ష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్ష‌కుల్ని కూడా మేక‌ర్స్ నిరాశ‌ప‌రిచారు. హీరో యష్ పుట్టిన రోజున లేదా సంక్రాంతి రోజున అయినా చిత్ర వ‌ర్గాలు ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తాయ‌ని య‌ష్ ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌లేక‌పోతున్నాయ‌ని. లేట్‌గా వ‌చ్చినా ప్రేక్ష‌కుల అంచ‌నాల్ని ఖ‌చ్చితంగా అందుకుంటామ‌ని ద‌ర్శ‌కుడు చెప్పుకొచ్చారు.

అన్న‌ట్టే ఈ చిత్ర టీజ‌ర్‌ని ఈ నెల 21న ఎట్టిప‌రిస్థితుల్లోనూ రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం భావిస్తున్న‌ట్టు తాజా న్యూస్‌, ఈ వార్త విని య‌ష్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నార‌ట‌. తొలి భాగం వ‌ర‌ల్డ్ వైడ్‌గా రెండ‌వంద‌ల కోట్ల‌కు మించి వ‌సూళ్లని రాబ‌ట్ట‌డంతో రెండ‌వ భాగంపై బిజినెస్ ప‌రంగా భారీ క్రేజ్ ఏర్ప‌డిన‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All