
`మహానటి`తో కీర్తిసురేష్ స్థాయి మారిపోయింది. ఈ సినిమాతో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యం వున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. తెలుగులో మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రంగ్‌దే చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో నూతన దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కిస్తున్న `పెంగ్విన్` చిత్రంలో నటిస్తోంది.
కార్తీక్ సుబ్బరాజు సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఓ గర్భిణిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ఇదొక థ్రిల్లర్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర రిలీజ్ ని వాయిదా వేశారు. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.
మేకర్స్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ ఫాంలో ఈ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌తో చర్చలు జరిగిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తిసురేష్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ వెర్షన్‌లలో రిలీజ్ చేస్తున్నారట. ఈ టు వెర్షన్స్‌కి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ తీసుకోబోతున్నట్టు చెబుతున్నారు.