Homeగాసిప్స్కీర్తి సురేష్ బికినీ కోసమే సన్నబడిందా?

కీర్తి సురేష్ బికినీ కోసమే సన్నబడిందా?

కీర్తి సురేష్ బికినీ కోసమే సన్నబడిందా?
కీర్తి సురేష్ బికినీ కోసమే సన్నబడిందా?

మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ రేంజ్ తెలుగులో పూర్తిగా మారిపోయింది. ఈ ఒక్క సినిమా ఆమెకు ఎనలేని రెస్పెక్ట్ ను తీసుకొచ్చింది. ఈ సినిమా విజయం, ఆమె నటన రెండూ కలిసి కీర్తి సురేష్ కు ఆఫర్ల వెల్లువ వచ్చేలా చేసాయి. ఇప్పుడు కీర్తి సురేష్ తెలుగులో చాలా బిజీగా ఉంది. మిస్ ఇండియా చిత్రాన్ని పూర్తి చేసిన కీర్తి సురేష్, గుడ్ లక్ సఖి, రంగ్ దే సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా నితిన్ తో మరో సినిమా, మహేష్ బాబుతో సినిమాల్లో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు.

అయితే ఈ మధ్యన కీర్తి సురేష్ బాగా సన్నబడింది. బికినీ కోసమే కీర్తి సన్నబడిందని, బికినీ ధరించాలంటే దానికి తగ్గ ఫిజిక్ ఉండాలని, అందుకోసమే కీర్తి సురేష్ తగిన బాడీని సంపాదించిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కీర్తి సురేష్ స్పందించింది.

- Advertisement -

తనను బికినీ ధరించమని అడిగిన మాట నిజమేనని, అయితే ఆ పని తాను చేయలేనని అందుకోసమే సినిమా నుండి బయటకు వచ్చేసానని తెలిపింది కీర్తి సురేష్. ఎప్పటినుండో తాను సన్నపడాలనుకుంటున్నానని తనకు తగ్గ బాడీ రావడానికి దాదాపు ఏడాదికి పైగా సమయం పట్టిందని తెలిపింది. తనను తాను ఫిట్ గా ఉంచుకోవడానికే సన్నపడ్డాను తప్ప బికినీ ధరించే ఉద్దేశాలు అసలు లేవని తెలిపింది కీర్తి సురేష్. అయినా మహానటి వంటి సినిమా తర్వాత తెలుగులో కచ్చితంగా ఏ నిర్మాత, దర్శకుడు ఆమెను బికినీ వేసుకోమని చెప్పే ధైర్యం కచ్చితంగా చేయరు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All