
`సాహో` వంటి సంచలన చిత్రం తరువాత ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ కృష్ణా మూవీస్ సమర్పణలో యువీ క్రియేన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.
కీలక షెడ్యూల్‌ని జార్జియాలో పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత ప్రభాస్ మరో పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సైంటిఫిక్ ఫిక్షన్‌గా హాలీవుడ్ స్టాయి టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకునేని ఎంపిక చేశారు.
ఈ విషయంపై క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించింది. `ప్రభాస్‌తో దీపిక చాలా పెద్ద వార్త ఇది. మరో బ్లాక్ బస్టర్ మూవీని రూపొందించడానికి మరో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్టయింది. ఇక ఈ వెయిటింగ్‌ని తట్టుకోలేను` అని కీర్తి సురేష్ కామెంట్ చేసింది. ప్రభాస్ 21వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కింగ్ తరహా పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని, వార్తలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ అని మరీ మరీ నాగ్ అశ్విన్ చెబుతుండటంతో `పీకె` తరహాలో ఓ ఏలియన్ కథా ఈ మూవీ వుండే అవకాశం వుందని కూడా ఊహాగానాలు మదలయ్యాయి.