Homeటాప్ స్టోరీస్లిప్ లాక్ లకు రెడీ కానీ ..నాక్కొంచెం సిగ్గెక్కువ

లిప్ లాక్ లకు రెడీ కానీ ..నాక్కొంచెం సిగ్గెక్కువ

keerthy suresh ready to lip lock rolesసినిమాల్లోకి హీరోయిన్ గా నటించడానికి రావడం అంటేనే అన్ని రకాల పాత్రలకు సిద్దమవ్వాల్సి ఉంటుందని నాకు తెలుసు , ఇక లిప్ లాక్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది నేను రెడీ కానీ …… నాక్కొంచెం సిగ్గెక్కువ ! అయినా ఇప్పటివరకు నన్ను ఏ దర్శకుడు కూడా లిప్ లాక్ సీన్లో నటించమని ఒత్తిడి చేయలేదు దాంతో నేను లక్కీ అనే అనుకుంటున్నాను అని అంటోంది మహానటి చిత్రంలో నటించి ఎనలేని కీర్తి ప్రతిష్టలను పొందిన కీర్తి సురేష్ . తమిళ భామ అయిన కీర్తి సురేష్ కు తెలుగునాట కూడా మంచి డిమాండ్ ఉంది , ఇక మహానటి తో తన చరిత ని చరితార్థం చేసుకుంది .

అయితే ఈ భామ పక్కింటి అమ్మాయి లా కనిపిస్తుంది కాబట్టి పెద్దగా గ్లామర్ పాత్రలు , ఎక్స్ పోజింగ్ పాత్రలు దర్శక నిర్మాతలు ఇవ్వలేదు , గ్లామర్ ఒలకబోసే పాత్రలే రానప్పుడు ఇక లిప్ లాక్ లు ఎలా చేయిస్తారు దాంతో నాకు ఆ ఛాన్స్ దొరకలేదు అని అంటోంది కీర్తి సురేష్ . తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించింది ఈ భామ . అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్న ఈ భామ కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ లు ఇవ్వడానికి సిద్దమే అని అంటోంది .

- Advertisement -

కీర్తి సురేష్ కి కాస్త సిగ్గు ఎక్కువే నట ! దాంతో ఆ సన్నివేశాల్లో నటించే సమయంలో ఇబ్బంది పడుతుంటానని కానీ అది కూడా నటనలో ఒక భాగం కాబట్టి తప్పదని అంటోంది . కీర్తి సురేష్ లిప్ లాక్ లకు రెడీ అంటోంది మరి ఇక ఆలస్యం దర్శక నిర్మాతలది , హీరోలది . ఎవరు కీర్తి సురేష్ కు ఆ ఛాన్స్ ఇస్తారో చూడాలి .

 

English Title:keerthy suresh ready to lip lock roles

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All