Homeటాప్ స్టోరీస్షూటింగులకు అనుమతులిస్తూ కేసీఆర్ నిర్ణయం

షూటింగులకు అనుమతులిస్తూ కేసీఆర్ నిర్ణయం

షూటింగులకు అనుమతులిస్తూ కేసీఆర్ నిర్ణయం
షూటింగులకు అనుమతులిస్తూ కేసీఆర్ నిర్ణయం

ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా, టివి వాళ్లకు తీపి కబురు అందించారు. కరోనా వైరస్ కారణంగా గత మూడు నెలలుగా షూటింగులు జరగని విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా చిరంజీవి, నాగార్జున నేతృత్వంలో కొంత మంది సినీ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ లతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కేంద్ర మార్గదర్శకాలను అనుమతిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ షూటింగులు చేసుకుంటామని వారు హామీ ఇచ్చారు. దీంతో తలసాని నేతృత్వంలోని అధికారిక బృందం విధివిధానాలను రూపొందించింది.

దీని ప్రకారంగా పరిమిత సంఖ్యలో జనంతో సినిమా షూటింగ్, టివి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వెంటనే మొదలుపెట్టుకోవచ్చని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తయారుచేసిన ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సంతకం చేసారు. దీంతో సినిమా షూటింగులకు మార్గం సుగమమైంది.

- Advertisement -

అయితే ఇప్పుడున్న మార్గదర్శకాల ఆధారంగా ఇప్పటికిప్పుడు థియేటర్లను ఓపెన్ చేయించలేమని ప్రభుత్వం తెలిపింది. దానికి ఇంకొంత సమయం కావాలని అంటోంది. ఏదేమైనా షూటింగులు మొదలవ్వనుండడంతో వేల మంది సినీ కార్మికులకు ఊరట కలిగించినట్లైంది.

ఈ తాజా నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All