Homeటాప్ స్టోరీస్ఉద్యమ సింహం ఆడియో

ఉద్యమ సింహం ఆడియో

KCR biopic udyamasimham audio eventతెలంగాణ పోరాట యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఉద్యమ సింహం . కల్వకుంట్ల నాగేశ్వర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ నాగేశ్వర్ రావు అందించడం విశేషం . నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఉద్యమ సింహం ఆడియో వేడుక జరిగింది . ఈవేడుకలో పెళ్ళి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి , గోపి , దర్శకులు , కృష్ణంరాజు అల్లూరి , కరాటే రాజా తదితరులు పాల్గొన్నారు . కేసిఆర్ పాత్రలో కరాటే రాజా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది . కేసిఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమా చేసామని , ఎన్నో మధుర ఘట్టాలు ఉన్నాయని అయితే అందులో కొన్ని అంశాలు మాత్రమే తీసుకొని ఈ సినిమా చేసామని , ఉద్యమ సింహం చాలా బాగా వచ్చిందని తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని ధీమా వ్యక్తం చేసాడు నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర్ రావు .

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ఉద్యమ సింహం విడుదల అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కి కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి . కేసిఆర్ కు అనుకూలంగా ఉన్న ఈ సినిమా సకాలంలో రిలీజ్ అయితే మంచి వసూళ్లు కూడా సాధించడం ఖాయం . ఎన్నికల సమయం కాబట్టి టిఆర్ఎస్ శ్రేణులు కూడా మద్దతుగా నిలవడం ఖాయం . ఉద్యమ సింహానికి ఎన్నికల సమయం కలిసి రానుంది .

- Advertisement -

English Title: KCR biopic udyamasimham audio event

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All