Homeటాప్ స్టోరీస్ఆ సినిమా విడుదల వాయిదా పడనుందా ?

ఆ సినిమా విడుదల వాయిదా పడనుందా ?

Kavacham release to be postponedబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం కవచం . సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ కవచం చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదల చేయాలనీ అనుకున్నారు , అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వాయిదా పడనుంది అని తెలుస్తోంది . నవంబర్ 29 న రజనీకాంత్ నటించిన 2. 0 చిత్రం విడుదల అవుతుండటంతో ఎక్కువ థియేటర్ లు దానికి కేటాయించడం ఖాయం . ఇక డిసెంబర్ 7 న చిన్న చిత్రాలు ఓ నాలుగు వరకు పోటీ పడుతున్నాయి , అంటే ఉన్న కొన్ని థియేటర్ లు అవి పంచుకోవాలి , ఒకవేళ 2. 0 సినిమా ప్రభంజనం సృష్టిస్తే థియేటర్ ల సమస్య మరింతగా పెరగడం ఖాయం దాంతో పోటీకి వెళ్లి తక్కువ థియేటర్ లలో రిలీజ్ చేయడం కంటే బెటర్ రిలీజ్ కోసం మరో వారం ఆగితే తప్పులేదని భావిస్తున్నారట .

అంతేకాదు కవచం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి , దాంతో సినిమా విడుదల వాయిదాపడటం ఖాయమని అంటున్నారు . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నాడు . ఇప్పటివరకు చేసిన సినిమాలేవీ హిట్ ని అందించలేక పోయాయి దాంతో కమర్షియల్ హిట్ కోసం తాపత్రయ పడుతున్నాడు . మరి ఈ కవచం బెల్లంకొండ ని కవచం లా కాపాడుతుందా ? లేదా ? అన్నది తేలాల్సి ఉంది .

- Advertisement -

English Title: Kavacham release to be postponed

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All