Homeటాప్ స్టోరీస్కవచంతో బెల్లంకొండ హిట్ కొట్టేలాగున్నాడు

కవచంతో బెల్లంకొండ హిట్ కొట్టేలాగున్నాడు

Bellamkonda sai srinivas 's Kavacham teaser talkబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ” కవచం ”. శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవీన్ నిర్మించాడు . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అందమైన భామలు కాజల్ అగర్వాల్ , మెహరీన్ లు నటించారు . నిన్న సాయంత్రం కవచం టీజర్ విడుదల చేసారు ఆ చిత్ర బృందం . టీజర్ చూస్తుంటే బెల్లంకొండ హిట్ కొట్టేలాగే ఉన్నాడు . పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు బెల్లంకొండ . యాక్షన్ తో పాటు ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్ర విజయం పై బెల్లంకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . అంతేకాదు తప్పకుండా హిట్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు యంగ్ హీరో .

సక్సెస్ కోసం ఈ హీరో ఎంతగానో పోరాడుతున్నాడు ఆ పోరాటానికి కవచం రూపంలో ఫలితం రానుందని ధీమాగా ఉన్నారు . ఇక కవచం టీజర్ విషయానికి వస్తే యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా తెలుస్తోంది . యాక్షన్ మాత్రమే కాదు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి కావలసినంత రొమాన్స్ కూడా ఉండనుంది . అందాల భామలు కాజల్ అగర్వాల్ , మెహరీన్ లు ఉండటంతో కుర్రకారుకి కావాల్సిన మజా అందించనున్నారు ఈ భామలు . టీజర్ తో ఇంప్రెస్ చేసారు , దాంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి . డిసెంబర్ లో కవచం చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అల్లుడు శీను చిత్రంతో మెప్పించిన బెల్లంకొండ కవచం తో సాలిడ్ హిట్ కొట్టడానికి సమాయత్తం అవుతున్నాడు .

- Advertisement -

English Title: Bellamkonda sai srinivas ‘s Kavacham teaser talk

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All