Homeటాప్ స్టోరీస్కాజల్ అగర్వాల్ ఆ కుర్ర హీరోతో ప్రేమలో పడిందా

కాజల్ అగర్వాల్ ఆ కుర్ర హీరోతో ప్రేమలో పడిందా

Kajal agarwal dating with tollywood hero  పదకొండేళ్ళుగా హీరోయిన్ గా రాణిస్తున్న భామ కాజల్ అగర్వాల్ ఓ టాలీవుడ్ కుర్ర హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . సక్సెస్ కోసం తెగ పోరాటం చేస్తున్న ఆ కుర్ర హీరో ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రేమాయణం సాగిస్తున్నాడని కథనాలు వినబడుతున్నాయి . ఇక ఆ హీరోని స్టార్ ని చేయడానికి అతడి తండ్రి భారీ చిత్రాలను నిర్మిస్తూనే ఉన్నాడు , అయితే భారీ సక్సెస్ అన్నది అందని ద్రాక్షే అయ్యింది ఆ కుర్ర హీరోకు .

తాజాగా ఆ హీరోతో ఈ భామ నటిస్తోంది కూడా దాంతో ఇద్దరి మద్య మంచి అండర్ స్టాండింగ్ కుదిరిందట . ఫారిన్ షెడ్యూల్ కావడంతో హాయిగా షూటింగ్ పూర్తయ్యాక ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ అక్కడి అందాలన్నీ తెగ చుట్టేస్తున్నారట . కాజల్ అగర్వాల్ కు 33 సంవత్సరాలు . అయితే ఈ భామ పెళ్ళి చేసుకోలేదు కానీ ఈమె కంటే చిన్నదైన చెల్లెలు మాత్రం పెళ్ళి చేసుకుంది పిల్లలను కూడా కన్నది . ఇక ఇప్పుడు కాజల్ కు పెళ్ళి మీద గాలి మల్లినట్లుంది . అయితే కాజల్ డేటింగ్ లో ఉందా ? లేక తూచ్ మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అంటుందా చూడాలి ఈ గుసగుసలు పెద్దవి అయ్యాక .

- Advertisement -

English Title: Kajal agarwal dating with tollywood hero

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All