Homeటాప్ స్టోరీస్ప్రభాస్ పై అటాక్ చేసిన కౌశల్ ఆర్మీ

ప్రభాస్ పై అటాక్ చేసిన కౌశల్ ఆర్మీ

Kaushal Army attacks on Prabhasయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై అటాక్ చేసింది కౌశల్ ఆర్మీ . ప్రభాస్ కంటే ప్రభాస్ ఆర్మీ కంటే కౌశల్ ఆర్మీ గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు కౌశల్ ఆర్మీ . ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అతడికి జన్మదిన శుభాకాంక్షలు అందజేయాల్సింది పోయి కొంతమంది మద్య మాటా మాటా పెరిగి ప్రభాస్ కంటే కౌశల్ ఆర్మీ గ్రేట్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు . సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఉంది . బిగ్ బాస్ 2 విన్నర్ అయిన కౌశల్ కు తన ఆర్మీ సహాయం ఎంతగానో ఉపయోగపడింది . అంతేకాదు ఇటీవలే ఆంధ్రపదేశ్ లో తిత్లి సైక్లోన్ తో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం లో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్గొని మరోసారి ఆర్మీ సత్తా చాటారు కౌశల్ ఆర్మీ .

హీరో నాని తో కౌశల్ కు బిగ్ బాస్ 2 హౌజ్ లో అంతగా పడలేదు దాంతో నాని నటించిన దేవదాస్ ని ఫ్లాప్ చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసారు కౌశల్ ఆర్మీ . చేసిన శపథం మేరకు దేవదాస్ కు భారీ ఓపెనింగ్స్ రాకుండా అడ్డుకున్నారు కూడా . ఇక ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత కు కౌశల్ ఆర్మీ ఫుల్ సపోర్ట్ చేసింది దాని ప్రభావం వసూళ్ళ మీద పడింది కూడా . దాంతో ఈ లెక్కన కౌశల్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ అన్న విషయం రూడీ అయ్యింది . అయితే ప్రభాస్ ని టార్గెట్ చేయడం ఏంటో ? పాపం ….. ఇదే విధంగా కౌశల్ ఆర్మీ ప్రభాస్ ని టార్గెట్ చేస్తే ” సాహో ” చిత్రానికి ఇబ్బందే మరి .

- Advertisement -

Read English:  Kaushal Army attacks on Prabhas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All