Homeటాప్ స్టోరీస్ప్రభంజనం సృష్టిస్తున్న కౌశల్ ఆర్మీ

ప్రభంజనం సృష్టిస్తున్న కౌశల్ ఆర్మీ

Kaushal army sensation in bigg boss historyబిగ్ బాస్ 2 హౌజ్ లోకి అనామకుడిగా అడుగుపెట్టాడు కౌశల్ అయితే అనూహ్యంగా ఇప్పుడు ప్రభంజనంలా తయారయ్యాడు కౌశల్ ఆర్మీ సహాయంతో . కౌశల్ ఆర్మీ నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన 2కే రన్ ప్రభంజనం సృష్టించడంతో అందరూ షాక్ అవుతున్నారు . బిగ్ బాస్ చరిత్రలోనే ఇటువంటి సంఘటన జరగలేదు దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోతున్నారట కౌశల్ కు వస్తున్న పాపులారిటీని చూసి . ఒకవైపు ఎన్నికల వేడి రాజుకుంది తెలంగాణాలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు లేవు కానీ అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధమే జరుగుతోంది , రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కోలాహలం నెలకొని ఉన్నప్పటికీ కౌశల్ ఆర్మీ సైతం అదేస్థాయిలో ప్రభావం చూపిస్తుండటంతో ఖిన్నులౌతున్నారు .

అసలు ఎవరీ కౌశల్ ఆర్మీ అంటూ పెద్ద చర్చ జరుగుతోంది . కౌశల్ ని ఎవరైనా ఎదిరిస్తే , టార్గెట్ చేసినట్లు మాట్లాడితే చాలు కౌశల్ ఆర్మీ వాళ్ళని ఎలిమినేట్ అయ్యేలా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తోంది ఓట్ల రూపంలో . కౌశల్ ఆర్మీ పద్దతి చూస్తుంటే బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ అని చెప్పకనే చెబుతున్నారు . ఒకవేళ కౌశల్ కు కాకుండా మరొకరిని ఎంపిక చేస్తే సహించేలా లేరు అంతటి తీవ్ర ప్రభావం చూపిస్తున్నారు కౌశల్ ఆర్మీ . బిగ్ బాస్ నిర్వాహకులతో పాటుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని సైతం ప్రభావితం చేసేలా ఆర్మీ ప్లాన్స్ ఉంటున్నాయి అంటే ఏ స్థాయిలో కౌశల్ ఆర్మీ పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు . సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ సంచలనం సృష్టిస్తోంది దాంతో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ అని తేల్చి చెబుతున్నారు .

- Advertisement -

English Title: Kaushal army sensation in bigg boss history

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All