Homeటాప్ స్టోరీస్40 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప్రభాస్

40 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప్రభాస్

Prabhas enters into age of 4039 సంవత్సరాలు దిగ్విజయంగా బ్రహ్మచారి జీవితాన్ని పూర్తిచేసుకొని 40 వ వసంతంలోకి అడుగుపెట్టాడు ప్రభాస్ ఈరోజే . అయితే ఈ నలభయ్యవ వసంతంలోనైనా పెళ్ళి కబురు చెప్పి బ్రహ్మచారి జీవితానికి ముగింపు పలుకుతడా అంటే డౌటే ! అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు . బాహుబలితో తన ఇమేజ్ ని ప్రపంచ వ్యాప్తం చేసుకున్నాడు ప్రభాస్ . బాహుబలి సిరీస్ లలో వచ్చిన రెండు చిత్రాలు కూడా అఖండ విజయాన్ని సాధించడంతో ప్రభాస్ మార్కెట్ కూడా పెరిగింది . దాంతో ప్రభాస్ నటించిన పాత చిత్రాలకు డిమాండ్ బాగానే పెరిగింది.

ప్రభాస్ పెళ్ళి గురించి గత నాలుగేళ్ళుగా ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి కానీ ప్రభాస్ పెళ్ళి మాత్రం కావడం లేదు . ప్రతీ ఏడాది ఈ సంవత్సరం తప్పకుండా ప్రభాస్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని అంటున్నారు అది షరామామూలుగా వాయిదా పడుతూనే ఉంది . మరి ఈ ఏడాది అయినా ప్రభాస్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో అని ఆశిస్తున్నారు . కానీ సీరియల్ లా……. జీడి పాకంలా ……. ప్రభాస్ పెళ్ళి తంతు సా …….గుతూనే ఉంది .

- Advertisement -

English Title: Prabhas enters into age of 40

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All