
వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన `నేక్డ్` ( నగ్నం)తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం `కాత్యాయని`. హెల్పింగ్ హ్యాండ్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై రమేష్ బొగ్గుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిరాజేష్ నీలం దర్శకత్వం వహిస్తున్నారు. ది వైరల్ లవ్ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మూడు సంవత్సరాల క్రితమే సాయి రాజేష్ నీలం ఈ కథ చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అందరికి నచ్చుతుంది. ప్రొడ్యూసర్ రమేష్ గారు 60 విలేజెస్ కోసం ఓ హాస్పిటల్‌ని నిర్మిస్తున్నారని తెలిసి ఆయన కోసమే ఈ సినిమా చేస్తున్నాను. నాకు ఆర్జీవిగారు మంచి లైఫ్ ఇచ్చారు. ఇండస్ట్రీలో నా గాడ్ ఫాదర్ రాముగారు` అని శ్రీ రాపాక తెలిపింది.
దర్శకుడు సాయిరాజేష్ నీలం మాట్లాతుతూ ` హెల్పింగ్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం `కాత్యాయని`. 1990 నేపథ్యంలో లవ్‌స్టోరీ. 2020లో జరిగే మూడు ప్రేమకథలకున్న సంబంధం ఏంటీ? వఆటిని కాత్యాయని ఎలా డీల్ చేసింది అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. నటనకు ఆస్కారమున్న పాత్రలో శ్రీరాపాక నటిస్తోంది. లవ్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం` సాయిరాజేష్ నీలం అన్నారు.