
కరోనా మహమ్మారి ప్రబలుతున్నా ఏ మాత్రం భయపడకుండా వరుస చిత్రాల్ని ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు మియా మాల్కోవాతో `క్లైమాక్స్` చిత్రాన్ని రూపొందించి రిలీజ్ చేసిన వర్మ యావత్ మేకర్స్‌ని ఆశ్చర్యానికి గురిచేశారు. తక్కువ నిడివితో చాలా తక్కువ బడ్జెట్‌తో సినిమాల్ని రూపొందించి ఓటీటీల ద్వారా ఈ కష్టకాలంలో కూడా లాభాల్ని పొందవచ్చని నిరూపించారు.
ఇటీవల విడుదల చేసిన నేక్డ్, పవర్‌స్టార్ చిత్రాలు కూడా వర్మకు మంచి లాభాల్నే అందించాయి. ప్రస్తుతం మర్డర్, థ్రిల్లర్, డేంజరస్, ఆర్నబ్ చిత్రాల్ని వర్మ రూపొందిస్తున్నారు. ఇందులో `థ్రిల్లర్` చిత్రం ఈ రోజే ఓటీటీఓ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా ముచ్చటించిన వర్మ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ప్రస్తుతం వున్న ఈ క్లిష్టపరిస్థితుల నుంచి ఇండస్ట్రీ బయటపడాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే అన్నారు. ఒక వేళ థియేటర్లు తెరుచుకున్నా ఒకప్పటి తరహాలో వంద కోట్ల వసూళ్లని చూడటం కష్టమే. ఓటీటీకి అలవాటు పడిన జనం అంత ఈజీగా థియేటర్‌కు వస్తారన్నది ఇప్పుడే చెప్పలేం అన్నారు వర్మ. ఇక తను రూపొందించిన `ఎంటర్ ది గర్ల్ డ్రాన్` చిత్రాన్ని మాత్రం ఓటీటీలో రిలీజ్ చేయనని, థియేటర్‌లో మాత్రమే రిలీజ్ చేస్తానని వర్మ స్పష్టం చేశారు.