
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న తమిళ్ హీరో కార్తీ. అన్న సూర్య తడబడుతున్నప్పటికి కార్తీ మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. ఖాకి సినిమా తరువాత మరోసారి కార్తీ తెలుగులో పాజిటివ్ టాక్ అందుకున్నాడు. దీపావళి కానుకగా విడుదలైన ఖైదీ సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకుంది. విడుదలైన మొదట్లో కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు. కానీ రెండవరోజు నుంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి.
మొత్తనికి 10రోజుల తరువాత సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చింది. ఓ విదంగా బిగిల్ వంటి పెద్ద సినిమా గట్టి పోటీని ఇచ్చినప్పటికి ఖైదీ మాత్రం తడబడకుండా మినిమమ్ కలెక్షన్స్ అందుకుంటూ వెళ్లింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సినిమా హక్కులు 4.75కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం సినిమా కలెక్షన్స్ 6కోట్లకు దాటినట్లు తెలుస్తోంది. దాదాపు బయ్యర్స్ కొన్న ధరను వెనక్కి తెచ్చేసుకున్నారు.
కార్తీ ప్రమోషన్స్ లో ఇంకాస్త హెల్ప్ చేసి ఉంటే తప్పకుండా సినిమా కలెక్షన్స్ పెరిగి ఉండేవి. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కార్తీ గతంలో సాధించిన ఓపెనింగ్స్ ఈ సినిమాతో రాబట్టలేకపోయాడు. అయితే మొత్తానికి బయ్యర్స్ ని మాత్రం ఖైదీ నష్టాల నుంచి గట్టెక్కించింది. ఇక మరికొన్ని రోజులు సినిమా ఇదే ఫ్లోలో వెళ్లగలిగితే మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. పోటీగా తెలుగు సినిమాలు కూడా లేవు. సో సినిమా ఎంతవరకు లాబాల్ని అందిస్తుందో చూడాలి.
- Advertisement -