Homeటాప్ స్టోరీస్కార్తీకి ఖైదీ విషయంలో ఖాకీ సీన్ రిపీట్.. ఎందుకిలా?

కార్తీకి ఖైదీ విషయంలో ఖాకీ సీన్ రిపీట్.. ఎందుకిలా?

karthis khaidi movie collectoins
karthis khaidi movie collectoins

ఏదైనా పోగొట్టుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుందంటారు. ఈ సామెత తమిళ స్టార్ హీరో కార్తీకు అతికినట్లు సరిపోతుంది. ఒకప్పుడు కార్తీకు తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఉండేది. కెరీర్ స్టార్టింగ్ లోనే తెలుగులో మార్కెట్ సంపాదించుకుని సూపర్ హిట్లు కొట్టాడు. వరసగా వచ్చిన హిట్లతో కార్తీ మార్కెట్ తెలుగులో బాగా పెరిగింది. ఒకానొక దశలో తమిళంతో సమంగా తెలుగులో కూడా కార్తీ సినిమాలు బిజినెస్ చేసేవి. ఈ అభిమానంతోనే కార్తీ తెలుగులో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టాడు.

అయితే అంతా బాగుందన్న సమయంలో కార్తీ కథల ఎంపికలో చేసిన తప్పుల కారణంతో అటు తమిళ్ లో ఇటు తెలుగులో వరస ప్లాపులను ఎదుర్కొన్నాడు. కొన్ని చిత్రాలు తమిళంలో ఓకే అనిపించినా తెలుగులో ప్లాప్ అయ్యాయి. అదే సమయంలో కొన్ని తమిళ నేటివిటీ ఉన్న సినిమాలు చేయడం వల్ల అవి తెలుగులో విడుదల చేయడానికి కుదర్లేదు. ఈ కారణాల వల్ల కార్తీకి తెలుగులో మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. ఒకప్పుడు పది కోట్లకు బిజినెస్ చేసే కార్తీ చిత్రాలు ఇప్పుడు నాలుగు కోట్లు అటు ఇటుకు మించి అవ్వట్లేదు. పైగా బాగున్న సినిమాలకు కూడా కలెక్షన్స్ రావట్లేదు.

- Advertisement -

రెండేళ్ల క్రితం కార్తీ నటించిన ఖాకీ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం నామమాత్రంగా వచ్చాయి. తమిళంలో ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వగా తెలుగులో మాత్రం ముక్కి మూలిగి యావరేజ్ అనిపించుకుంది. ఇది తెలుగు డిస్ట్రిబ్యూటర్ ను బాగా ఇబ్బంది పెట్టింది. చూస్తుంటే ఇప్పుడు అదే సీన్ మళ్ళీ కార్తీ సినిమా విషయంలో జరుగుతోందా అనిపిస్తోంది. ఖాకీకి లానే కార్తీ రీసెంట్ సినిమా ఖైదీకి కూడా అదిరిపోయే రేంజ్ లో టాక్ వచ్చింది.

ఇటీవలే వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్ లో ఇది ఒకటని అన్నారు. క్రిటిక్స్ రేటింగ్స్ కూడా సూపర్ గా వచ్చాయి. బిజినెస్ కూడా కేవలం నాలుగున్నర కోట్లకు జరిగింది. దీంతో కార్తీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం పక్కా అనుకున్నారంతా. కానీ ఖైదీ కలెక్షన్స్ విషయంలో నెమ్మదించడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తోంది. తమిళంలో సూపర్ గా కలెక్షన్స్ వస్తున్నాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నెమ్మదిగా కుంటుకుంటూ బ్రేక్ ఈవెన్ వైపు వెళుతోంది. ఐదు రోజులకు ఈ చిత్రం 4 కోట్లకు కొద్దిగా పైన వసూలు చేసింది.

అంటే హిట్ అనిపించుకోవాలంటే మరో కోటి వసూలు చేయాలి. రేపటి నుండి కొత్త సినిమాలు సందడి చేస్తున్న వేళ ఖైదీ ఇంకా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలడా అన్నది సందేహమే. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా కాదా అన్నది కాదు సమస్య. ఇంత మంచి టాక్ వచ్చిన సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంత ఇబ్బంది పడడమేంటి అని. కార్తీ సినిమాల విషయంలో ఎందుకిలా జరుగుతోంది?

ఖైదీ రెండు తెలుగు రాష్ట్రాల 5 రోజుల కలెక్షన్స్ వివరాలు..
నైజాం – 1.68 కోట్లు
సీడెడ్ – 63 లక్షలు
యూఏ – 45 లక్షలు
ఈస్ట్ – 35 లక్షలు
వెస్ట్ -21 లక్షలు
గుంటూరు – 24 లక్షలు
కృష్ణా – 31 లక్షలు
నెల్లూరు – 17 లక్షలు

మొత్తం – 4.01 కోట్లు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All