Homeటాప్ స్టోరీస్ఖైదీ వీకెండ్ కలెక్షన్స్ - మూడో రోజే ఎక్కువ

ఖైదీ వీకెండ్ కలెక్షన్స్ – మూడో రోజే ఎక్కువ

ఖైదీ వీకెండ్ కలెక్షన్స్ - మూడో రోజే ఎక్కువ
ఖైదీ వీకెండ్ కలెక్షన్స్ – మూడో రోజే ఎక్కువ

చూస్తుంటే కార్తీ ఈసారి గట్టిగానే హిట్ కొట్టాడనిపిస్తోంది. కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఖైదీ కల్ట్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రానికి మొదట అంతగా రెస్పాన్స్ లేదు. లో రిలీజ్ ఇవ్వడం, ప్రమోషన్స్ లో కూడా కావాలని లో ప్రొఫైల్ మైంటైన్ చేయడంతో ఫోకస్ మొత్తం పోటీగా విడుదలైన విజిల్ తీసుకుపోయింది. అందుకే తొలిరోజు ఖైదీ వసూళ్లు నామమాత్రంగానే మొదలయ్యాయి. తొలిరోజు తొలి రెండు ఆటలకు కనీస స్పందన లేకపోయింది. కేవలం 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే టాక్ బలంగా స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా పుంజుకున్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్స్ గా ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు. కథ నుండి డీవియేట్ కాకుండా చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజు ప్రేక్షకులు లేక రెండు తెలుగు రాష్ట్రాల నుండి కేవలం 30 లక్షల షేర్ నమోదు చేసిన ఖైదీ రెండో రోజు నుండి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

రెండో రోజు నుండి చాలా చోట్ల 90 శాతం ఆక్యుపెన్సీ నమోదవ్వడం విశేషం. రెండో రోజు ఈ చిత్రం దాదాపు 90 లక్షల షేర్ వసూలు చేయగలిగింది. అంటే మొదటి రోజుకంటే మూడింతల వసూళ్లు వచ్చాయి. ఇక మూడో రోజు అంటే ఆదివారం, దీపావళి రోజున ఖైదీ ప్రభంజనాన్ని సృష్టించింది. విజిల్ టాక్ కొంచెం వీక్ అవ్వడం, రెండు చిత్రాల మధ్య కంపేరిజన్ లో ఖైదీ బెటర్ అనే టాక్ రావడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఖైదీ వైపు కదిలారు. దీంతో ఖైదీకి చాలా చోట్ల ఆదివారం నాడు హౌజ్ ఫుల్స్ పడ్డాయి. మొదటి రెండు రోజులు కలిపినదానికంటే మూడో రోజు వసూళ్లే ఎక్కువగా రావడం విశేషం. మొదటి రెండు రోజులు వరసగా 30 లక్షలు, 90 లక్షలు షేర్ వసూలు చేసిన ఖైదీ, మూడో రోజు బ్రహ్మాండంగా కోటి ముప్పై లక్షల షేర్ రాబట్టింది. ఈ రేంజ్ లో పుంజుకున్న చిత్రం ఈ మధ్య కాలంలో మరొకటి లేకపోవడం విశేషం. దీంతో మూడు రోజులకు కలిపి ఈ చిత్రం రెండు కోట్ల యాభై లక్షల షేర్ రాబట్టినట్లయింది.

- Advertisement -

ఖైదీ చిత్రానికి చాలా తక్కువ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కార్తీ రీసెంట్ ట్రాక్ రికార్డ్ బాలేకపోవడంతో భారీ రేట్లు పెట్టడానికి బయ్యర్లు ముందుకు రాలేదు. దాంతో నాలుగున్నర కోట్లకు తెలుగు రాష్ట్రాల వరకూ ఖైదీని అమ్మారు. కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారు. మరో 2 కోట్లు సాధిస్తే ఖైదీ బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే ఖైదీ రెండో వారాంతంలోపే బ్రేక్ ఈవెన్ చేరుకునేలా కనిపిస్తోంది.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వ ప్రతిభ, కార్తీ నటనా కౌశలం, బ్రిలియంట్ టెక్నీకల్ వాల్యూస్ వెరిసి ఖైదీ ఒక మంచి చిత్రంగా నిలబడింది. తమిళంలో కూడా ఈ చిత్రానికి జనాలు నీరాజనాలు పడుతున్నారు. మొత్తమ్మీద కార్తీ ఒక హిట్ అందుకున్నట్లే. ఇదే స్ట్రీక్ కంటిన్యూ చేస్తే కార్తీ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ తన పట్టు నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All