
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మ హత్య బాలీవుడ్ సెలబ్రిటీల పాలిట శాపంగా మారింది. సుశాంత్ మరణానికి నెపోటిజానికీ, డ్రగ్స్‌కీ సంబంధం వుండటంతో ఈ కేసు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్ మృతి తరువాత బాలీవుడ్ బిగ్గీస్‌పై భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్‌లో ప్రధానంగా బుక్కైన వ్యక్తి కరణ్ జోహార్. ఇతని వల్లే బాలీవుడ్‌లో నెపోటిజమ్ వేళ్లూనుకుంటోందని నెటిజన్స్ భారీ స్థాయిలో కరణ్ జోహార్‌ని ఆడేసుకున్నారు.
తాజాగా ముంబైలో పరిస్థితి మరింత వేడెక్కుతున్న నేపథ్యంలో కంగన విరుర్లతో పాటు బాలీవుడ్‌లో డ్రగ్స్ పార్టీలపై నిఘా విభాగం ప్రత్యే దృష్టిని పెట్టడం వంటి కారణాలతో కరణ్ జోహార్ ముంబై నుంచి గోవాకు చెక్కేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఫ్యామిలీతో సహా దర్శనమిచ్చిన కరణ్ ప్రశాంతత కోసం గోవాకు మకాం మార్చినట్టు తెలిసింది.
అయితే బాలీవుడ్‌లో నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో సోదాల నేపథ్యంలోనే కరణ్ జోహార్ గోవా వెళ్లాడని పలువురు బాలీవుడ్ వర్గాలు కరణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కరణ్ జోహార్ బాలీవుడ్ వర్గాలకు ఇచ్చిన పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పార్టీ గుట్టు బయటపడుతుందనే కరణ్ గోవా వెళ్లారన్న వాదనకు ఈ వీడియో బలాన్ని చేకూరుస్తోంది.