
పూరిజగన్నాథ్ సినిమా అంటే హీరో చాలా ఆసక్తిచూపిస్తుంటారు. ఆయన సినిమాల్లో హీరోని ప్రెజెంట్ చేసే తీరు భిన్నంగా వుంటుంది. దాంతో ప్రతీ హీరో ఒక్కసారైనా పూరితో కలిసి సినిమా చేయాలని భావిస్తుంటారు. `ఇస్మార్ట్ శంకర్` చిత్రం తరువాత విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి, చార్మితో కలిసి బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కమ్, డైరెక్టర్ కరణ్‌జోహార్, అపూర్వమెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ బాక్సార్‌గా కనిపించబోతున్నారు. ముంబై వీధుల్లో పలు కీలక సన్నివేశాలతో పాటు హీరో, హీరోయిన్‌పై బైక్ ఛేజింగ్ దృశ్యాలని చిత్రీకరించారు.
ఈ చిత్రం కోసం `ఫైటర్` అనే టైటిల్‌ని పూరి ఫైనల్ చేశాడు. అయితే ఈ చిత్రానికి సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్న కరణ్‌జోహార్‌కి ఆ టైటిల్ నచ్చలేదట. దీంతో మరో టైటిల్‌ని పెట్టాలని ఆ స్థానంలో `లైగర్` అనుకున్నారట. పాన్ ఇండియా స్థాయి సినిమాకి తగ్గ టైటిల్‌గ లేదని మళ్లీ కరణ్ అభ్యంతరం చెప్పడంతో పూరిజగన్నాథ్ కొత్త టైటిల్ని వెతికే పనిలో వున్నారట. వన్స్ కరణ్ మెచ్చే టైటిల్ కుదిరితే వెంటనే అనౌన్స్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.