Homeటాప్ స్టోరీస్కొత్త టర్న్ తీసుకున్న సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు

కొత్త టర్న్ తీసుకున్న సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు

కొత్త టర్న్ తీసుకున్న సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు
కొత్త టర్న్ తీసుకున్న సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఇది ఆత్మహత్య కాదని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందని బలంగా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది ఆత్మహత్య మాత్రమేనని పోలీసులు స్పష్టం చేసిన విషయం తెల్సిందే. నిన్న సుశాంత్ తండ్రి కేకే సింగ్, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెల్సిందే. ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

వాటి ప్రకారం సుశాంత్ ఆత్మహత్య వెనుక రియా హస్తం ఉందని కేకే సింగ్ వాదిస్తున్నారు. సుశాంత్ అకౌంట్ లో ఉన్న 17 కోట్లలో 15 కోట్లు లాక్ డౌన్ కు ముందు వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయని, అలాగే సుశాంత్ ఆత్మహత్యకు సరిగ్గా వారం రోజుల ముందు రియా సుశాంత్ ఇంటి నుండి లాప్ టాప్, క్రెడిట్ కార్డు మరి ఇతర కొన్ని విలువైన వస్తువులతో బయటకు వచ్చినట్లు కేకే సింగ్ ఆరోపిస్తున్నారు. అలాగే సుశాంత్ సింగ్ బాడీ గార్డ్, ఇతర స్టాఫ్ ను రియానే దగ్గరుండి తొలగించిందని, అలాగే సుశాంత్ కొత్త సినిమాలు సంతకం చేయకుండా రియా అడ్డుకుందని కేకే సింగ్ ఆరోపణలు చేసారు.

- Advertisement -

ఇప్పుడు తన మీద ఎఫ్ఐఆర్ నమోదవడంతో రియా తదుపరి ఏం చేయాలన్న విషయంలో నిన్న రాత్రి లాయర్లతో మీట్ అయింది. దాన్ని బట్టి ఈరోజు ముందస్తు బెయిల్ కోసం రియా దరఖాస్తు చేసుకుంటోందని వినికిడి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All