Homeటాప్ స్టోరీస్కాజ‌ల్ సెట్స్‌కి వ‌చ్చేది అప్పుడే!

కాజ‌ల్ సెట్స్‌కి వ‌చ్చేది అప్పుడే!

కాజ‌ల్ సెట్స్‌కి వ‌చ్చేది అప్పుడే!
కాజ‌ల్ సెట్స్‌కి వ‌చ్చేది అప్పుడే!

స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగర్వాల్ త‌న చిర‌కాల మిత్రుడు, బాయ్ ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూని గ‌త నెల 30న వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్లి త‌రువాత భ‌ర్త‌తో క‌లిసి హ‌నీమూన్ కోసం మాల్దీవుల‌కు వెళ్లింది. అక్క‌డి దీవుల్లో.. బీచ్‌లో భ‌ర్త‌తో క‌లిసి హంగామా చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. హ‌నీమూన్‌కి సంబంధించిన ఫోటోల‌తో పాటు అండ‌ర్ వాట‌ర్‌లో బెడ్ రూమ్‌కి సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల‌తో షేర్ చేసుకుంది.

మాల్దీవ్స్ హ‌నీమూన్ కోసం భారీ గానే ఖ‌ర్చు చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్ త్వ‌ర‌లో సెట్స్‌లో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతోంద‌ట‌. భ‌ర్త గౌత‌మ్‌తో క‌లిసి గ‌త వారం రోజులుగా హ‌నీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్న కాజ‌ల్ వెంట‌నే షూటింగ్ ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి `ఆచార్య‌` చిత్రంలో న‌టిస్తోంది.

- Advertisement -

ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో సెట్‌లోకి చిరు కూడా ఎంట‌ర్ కాబోతున్నారు. వ‌చ్చే నెల 5 నుంచి కాజ‌ల్ `ఆచార్య‌` షూటింగ్‌లో పాల్గొన‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ మూవీ పూర్తి కాగానే క‌మ‌ల్ – శంక‌ర్‌ల `ఇండియ‌న్ 2` కు డేట్స్ కేటాయించ‌నుంద‌ట‌. ఈ రెండు చిత్రాల‌తో పాటు కాజ‌ల్ … మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న `మోస‌గాళ్లు` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All