Wednesday, March 22, 2023
Homeటాప్ స్టోరీస్అర్జున్ రెడ్డి కి హిందీలో పేరేంటో తెలుసా

అర్జున్ రెడ్డి కి హిందీలో పేరేంటో తెలుసా

Kabir singh is the title of arjun reddy hindi remakeటాలీవుడ్ లో సంచలనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి . విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రభంజనం సృష్టించడంతో విజయ్ దేవరకొండకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి దాంతో ఈ సినిమాని మిగతా బాషలలో రీమేక్ చేయడానికి పోటీ పడగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తానే హిందీలో రీమేక్ చేయడానికి సంకల్పించాడు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా పునర్నిర్మించాడు సందీప్ రెడ్డి వంగా . హీరోయిన్ గా మహేష్ భామ కైరా అద్వానీ ని తీసుకున్నారు . ఇక ఈ చిత్రానికి హిందీలో పెట్టిన పేరు ఏంటో తెలుసా ……. ” కబీర్ సింగ్ ” . అవును తెలుగులో అర్జున్ రెడ్డి కాగా తమిళంలో వర్మ గా నామకరణం చేసారు . ఇక ఇప్పుడేమో హిందీలో కబీర్ సింగ్ గా అనౌన్స్ చేసారు టైటిల్ ని .

- Advertisement -

తెలుగునాట సంచలనం సృష్టించిన ఈ అర్జున్ రెడ్డి హిందీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ధీమాగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగా . బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న కబీర్ సింగ్ ఎలాంటి సంచలనం సృస్టించనుందో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు ఎదురు చూడాల్సిందే . ఎందుకంటే 2019 జూన్ 21 న కబీర్ సింగ్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు .

English Title: Kabir singh is the title of arjun reddy hindi remake

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts