Homeటాప్ స్టోరీస్అర్జున్ రెడ్డి కమెడియన్ కు పెళ్ళి

అర్జున్ రెడ్డి కమెడియన్ కు పెళ్ళి

comedian rahul ramakrishnaఅర్జున్ రెడ్డి , గీత గోవిందం, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు . అర్జున్ రెడ్డి చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ . డైలాగ్ డెలివరీ లో అలాగే నటనలో ఓ ఐడెంటిటీ ఏర్పరచుకున్న రామకృష్ణ తనకు కాబోయే భార్య తో దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో పెట్టేసి జనవరి 15 న పెళ్ళి చేసుకోబోతున్నాను అంటూ పోస్ట్ పెట్టడమే కాకండా ఎవరికీ చెప్పకండి అంటూ ఫన్నీ కామెంట్ కూడా పెట్టాడు .

కమెడియన్ పెళ్ళి వార్త సోషల్ మీడియాలో పెట్టగానే దాన్ని చూసిన పలువురు సినిమా నటీనటులు , సాంకేతిక నిపుణులు అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యువత అతడికి శుభాకాంక్షలు అందజేసారు , అందజేస్తున్నారు . చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ , మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అలాగే ప్రేక్షకుల మెప్పు కూడా పొందాడు రాహుల్ రామకృష్ణ .

- Advertisement -

English Title: comedian rahul ramakrishna announces his marriage date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All