Homeటాప్ స్టోరీస్స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనపడనున్న ఎన్టీఆర్

స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనపడనున్న ఎన్టీఆర్

ntr to play student union leader in his 30th movie
ntr to play student union leader in his 30th movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ ను పూర్తి చేసాడు. ఈ చిత్రంలో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దసరాకు విడుదల అనుకున్నా కానీ ప్రస్తుతం అది జరిగే అవకాశాలు కనిపించట్లేదు.

ఇక ఎన్టీఆర్ ఇప్పుడు రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంను హోస్ట్ చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక తన 30వ చిత్రంపై ఫోకస్ చేస్తాడు. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడని ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. కళ్యాణ్ రామ్ తో పాటు మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

- Advertisement -

ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ చిత్రంలో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపిస్తాడు. కొరటాల శివ సినిమాల స్టైల్ లోనే ప్యాసివ్ గానే ఈ పాత్ర ఉండనుంది. అయితే ఫ్యాన్స్ స్టఫ్ కు లోటు మాత్రం ఉండదట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All