Homeటాప్ స్టోరీస్కళ్యాణ్ రామ్ సినిమాకు బలమైన సాంకేతిక వర్గం!!

కళ్యాణ్ రామ్ సినిమాకు బలమైన సాంకేతిక వర్గం!!

కళ్యాణ్ రామ్ సినిమాకు బలమైన సాంకేతిక వర్గం!!
కళ్యాణ్ రామ్ సినిమాకు బలమైన సాంకేతిక వర్గం!!

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ నటిస్తోన్న పలు ప్రాజెక్ట్స్ వివిధ ప్రొడక్షన్ దశల్లో ఉన్నాయి. వాటిలో డెవిల్ కూడా ఒకటి. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సాగుతోంది. ఇందులో సీక్రెట్ బ్రిటిష్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడు.

1945ల కాలానికి సంబంధించిన కథతో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం ప్రముఖ సాంకేతిక నిపుణులు రామకృష్ణ, మోనికాలు ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు కథ కావడంతో ఆర్ట్ విషయంలో, ప్రొడక్షన్ డిజైన్ నేపథ్యంలో బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలి. అందుకే పలు టాప్ సినిమాలకు కలిసి పనిచేసిన వీరిని ఈ చిత్రానికి తీసుకున్నారు.

- Advertisement -

శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించాడు. నవీన్ మేడారం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా అభిషేక్ నామా భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All