
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా పనులను పూర్తి చేసాడు. దీంతో తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టేందుకు ఫ్రీ అయ్యాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పుడు మొదలైపోయాయి. ఈ ప్రాజెక్ట్ కు అనిరుధ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ కు తన వర్క్ ను మొదలుపెట్టాడు. ఇప్పటికే ట్యూన్స్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అనిరుధ్ భారీ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నట్లు సమాచారం. అజ్ఞాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత అనిరుధ్ సంగీతం అందించనున్న నాలుగో చిత్రమిది.
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి వర్క్ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే కథానాయికగా నటించనుంది. ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రానుంది. సమ్మర్ 2022కు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.