Homeటాప్ స్టోరీస్స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ ..?

స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ ..?

స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ ..?
స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ప్రస్తుతం ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం ) మార్చి 25 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కోసం అభిమానులే కాదు యావత్ సినీ ప్రేక్షకులు , నటి నటులు , సాంకేతిక వర్గం వారు ఇలా అంత ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటె ఎన్టీఆర్ , చరణ్ లు తమ తదుపరి చిత్రాల్లో బిజీ గా ఉన్నారు. ఇప్పటికే చరణ్ శంకర్ డైరెక్షన్లో తన 15 వ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంటె..ఎన్టీఆర్ సక్సెస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి భారీ విజయం అందుకోవడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకే కొరటాల శివ చాల జాగ్రత్తగా కథను సిద్ధం చేసాడట. ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఈ చిత్రానికి సంబదించిన ఓ వార్త వైరల్ గా మారింది.

- Advertisement -

ఈ సినిమాలో ఎన్టీఆర్ బస్తీ విద్యార్థులు హక్కుల కోసం పోరాడే స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడనే టాక్ వినిపించింది. అందుకోసం అవినీతి రాజకీయ నాయకుల భారతం పడతాడని అన్నారు. కానీ ఈ సినిమా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నడుస్తుందనే వేరే లైన్ ఇప్పుడు వినిపిస్తోంది.

చాలా ప్రాంతాల్లో ఆచారాల పేరుతో మూఢనమ్మకాలను మనం చూస్తూనే ఉంటాము. ఆచారం పేరుతో తమని తాము గాయపరుచుకోవడం .. శిక్షించుకోవడం చూస్తుంటాము. అలాంటి మూఢనమ్మకాల వైపు నుంచి చైతన్యం వైపుకు జనాలను నడిపించే సందేశంతో ఈ కథ నడుస్తుందని చెపుతున్నారు. మరి ఈ రెండు లైన్ లలో ఏది నిజమో తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All