
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదల కానుండగా, ఆచార్య ఫిబ్రవరి 4న విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాను కూడా లైన్లో పెట్టేసాడు. అగ్ర దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ ప్యాన్ ఇండియన్ మూవీని చేస్తోన్న విషయం తెల్సిందే. తెలుగు-తమిళ్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మిగిలిన భాషల్లో కూడా విడుదల చేస్తారు.
ఇదిలా ఉంటే రామ్ చరణ్, శంకర్ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూణేలో పూర్తయింది. అక్కడ కొన్ని రోజులు షూటింగ్ చేసాక, రీసెంట్ గా హైదరాబాద్ లో సాంగ్ షూట్ ను ప్రారంభించారు. ఈ సాంగ్ షూట్ మొత్తం 10 రోజుల పాటు సాగుతుందని సమాచారం. ఏకంగా వివిధ దేశాలకు చెందిన 80 మంది ఫారిన్ డ్యాన్సర్లను ఈ సాంగ్ కోసం హైదరాబాద్ రప్పించారు. జానీ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు.
ఈ సాంగ్ కోసం ఖరీదైన సెట్ ను కూడా నిర్మించారు. శంకర్ సినిమాల్లో పాటలకు డిఫరెంట్ అప్పీల్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గ స్థాయిలోనే శంకర్ ఈ చిత్రంలో సాంగ్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
రామ్ చరణ్ – శంకర్ సినిమాతో జీ స్టూడియోస్ భాగస్వామ్యం
మరోసారి రామ్ చరణ్ రెండు పడవల ప్రయాణం
#RC15: రామ్ చరణ్ – కియారాల మధ్య భారీ బడ్జెట్ డ్యూయట్