Homeటాప్ స్టోరీస్బ్రిటీష్ సైనికులతో భీకర పోరాటం చేస్తున్న ఎన్టీఆర్

బ్రిటీష్ సైనికులతో భీకర పోరాటం చేస్తున్న ఎన్టీఆర్

అసలు సిసలైన కొదమ సింహం లాంటి మన్యం వీరుడు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం బ్రిటిష్ సైనికులతో భీకర పోరాటం చేస్తున్నాడు జూనియర్ . ఓటమి ఎరుగని దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో భారీ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే . 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ – చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతోంది .

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ బ్రిటిష్ సైనికులతో భీకర పోరాటం చేసే సన్నివేశాలను భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు జక్కన్న . జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషిస్తున్న విషయం తెలిసిందే . చరణ్ సరసన అలియా భట్ ఫిక్స్ కాగా ఎన్టీఆర్ సరసన ఇంకా ఏ హీరోయిన్ ఫైనల్ కాలేదు . ఒకవైపు షూటింగ్ చేస్తూనే హీరోయిన్ వేట కొనసాగిస్తున్నాడు జక్కన్న . సాయి పల్లవి ని హీరోయిన్ గా ఎంపిక చేసే పనిలో ఉన్నారట . చరణ్ ప్రస్తుతం విదేశాల్లో విడిది చేసాడు , త్వరలోనే ఇండియాకు వచ్చాక ఆర్ ఆర్ ఆర్ లో జాయిన్ కానున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All