Homeటాప్ స్టోరీస్జూనియర్ ఎన్టీఆర్ తో మరో జూనియర్

జూనియర్ ఎన్టీఆర్ తో మరో జూనియర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో మరో జూనియర్ టైగర్ కలిసి నడుస్తున్న ఫోటో ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు . తమ అభిమాన కథానాయకుడు అందునా తన తనయుడితో కలిసి నడుస్తున్న ఫోటో కావడంతో దాన్ని షేర్ ల మీద షేర్ లు చేస్తూ పరవశించిపోతున్నారు . జూనియర్ ఎన్టీఆర్ కు అభయ్ రామ్ అనే కొడుకు ఉన్న విషయం తెలిసిందే . జూనియర్ ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు కాగా పెద్దోడు అభయ్ రామ్ .

- Advertisement -

గుబురు గడ్డంతో మీసం మెలేస్తూ ఎన్టీఆర్ నడుస్తుంటే తండ్రి చేయి పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ తండ్రి ని అనుసరిస్తున్నాడు అభయ్ రామ్ . ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . మన్యం వీరుడు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు . రాజమౌళి దర్శకుడు కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి . ఇక ఈ చిత్రాన్ని 2020 జూలై లో విడుదల చేయాలనీ భావిస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All