Homeఎక్స్ క్లూసివ్“జోకర్” అంటే ఆస్కార్ రావాల్సిందే మరి...!

“జోకర్” అంటే ఆస్కార్ రావాల్సిందే మరి…!

“జోకర్” అంటే ఆస్కార్ రావాల్సిందే మరి...!
“జోకర్” అంటే ఆస్కార్ రావాల్సిందే మరి…!

క్రిస్టోఫర్ నోలాన్ అనే పెద్దమనిషి ఏ ముహూర్తాన “జోకర్” అనే క్యారెక్టర్ క్రియేట్ చేసాడో గానీ, జనాల్లో అంతర్గతంగా ఉన్న విచారాన్ని, వికారాన్ని, లాజిక్ లను ఆ క్యారెక్టర్ గుంజి కొట్టింది. దెబ్బతో పాప్ కల్చర్ లో ఒక దేవుడికి ఉండే ఇమేజ్ వచ్చేసింది “జోకర్” కి. జోకర్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్, జోకర్ ఐడియాలజీ ని ప్రమోట్ చేసే వస్తువులు కూడా మార్కెట్ లో వచ్చేసాయి. ఇప్పటికీ మంచి డెప్త్ ఉండే డైలాగ్స్ రాసుకోడానికి, రైటర్స్ అంతా కుదిరితే “డార్క్ నైట్” సినిమా చూస్తారు,లేకపోతే కనీసం నెట్ లో ఉండే కొటేషన్స్ అన్నీ ఒక్కసారి డౌన్ లోడ్ చేసైనా చదువుకుంటారు.

తర్వాత గత ఏడాది కూడా జోకర్ పేరుతో ఇంకొక సినిమా వచ్చింది. మనుషులు బంధాలు, ప్రేమలు, భావాలు ఇవన్నీ ఎలా మారుతూ ఉంటాయో చూపించారు ఆ సినిమాలో. ఇక ఆ సినిమా కూడా ఇంటర్నేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో టైటిల్ రోల్ చేసిన నటుడు జోక్విన్ ఫోనిక్స్ ఇప్పటికే మూడు సార్లు ఆస్కార్ నామినేట్ అయిన వ్యక్తి. “జోకర్” సినిమాకు వచ్చిన ఆస్కార్ తోపాటు ఆయనకు బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్, యాక్టర్స్ గ్రిల్డ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. గతంలో “డార్క్ నైట్” సినిమా లో జోకర్ గా మనల్ని మెస్మరైజ్ చేసిన నటుడు “హీత్ లేద్జర్” కు ఆస్కార్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది. ఇక ప్రస్తుతం బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుచుకున్న జోక్విన్ ఫీనిక్స్ అయితే ఈ పాత్ర కోసం మూడు నెలల పాటు రోజుకు ఒకే ఒక్క యాపిల్ తింటూ, ప్రోటీన్ షేక్స్, మల్టీ విటమిన్ క్యాప్సుల్స్ వేసుకుని శరీరాన్ని పాత్రకు తగ్గట్టు తాయారు చేసారట. చివరగా జోకర్ చెప్పిన వాటిలో ఒకానొక బెస్ట్ డైలాగ్ చెప్పుకుంటే “when you are good at something, never do it for free”. దీన్నే త్రివిక్రమ్ గారు అనే పెద్దాయన తన జులాయి సినిమాలో కొంచెం మార్చి విలన్ సోనూ సూద్ తో చెప్పించాడు “మనకు వచ్చిన పని ఫ్రీ గా చెయ్యకూడదు, నచ్చని పని ట్రై చెయ్యకూడదు ”.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All