Homeఎక్స్ క్లూసివ్2019 గూగుల్ లో టాప్ 10 సెర్చ్ ఐటమ్స్

2019 గూగుల్ లో టాప్ 10 సెర్చ్ ఐటమ్స్

Top 10 Google india search items
Top 10 Google india search items

మరీ లోతుగా వెళ్ళకుండా సింపుల్ గా చెప్పాలంటే మనం ఎక్కడ , ఎప్పుడు ఎం చేస్తున్నామో ఒక వ్యవస్థ కనుసన్నలలో నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. అదే మన కంటికి కనిపించకుండా, మనల్ని గమనిస్తూ. శాసిస్తున్న కొంతమంది సమూహం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం మనుషులు, సాటి మనుషులను కాకుండా, అరచేతిలో ఉన్న టెక్నాలజీ నే నమ్ముతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే , “మనం మనుషులను ప్రేమించాలి – వస్తువులను వాడుకోవాలి… కానీ మనం రివర్స్ లో వస్తువులను వాడుకుంటున్నాం.” ఇక సమాచారం కోసం ఎక్కువగా, సెర్చ్ ఇంజిన్ లు అయిన గూగుల్, యాహూ , బింగ్ వంటి వాటిపై ఆధారపడుతున్నారు. వీటిలో యూజర్ ఫ్రెండ్లీ కనుక ఎక్కువ మంది గూగుల్ నే వాడుతున్నారు .

ఇక 2019 లో ఇండియాకు సంబంధించి గూగుల్ లో ప్రజలు దేనికోసం ఎక్కువగా వెతికారు అనే అంశానికి సంబంధించి మొదటి 10 విషయాలు వరుసగా చూసినట్లైతే ,

- Advertisement -

పదో స్థానంలో భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన ఉంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం సాలీనా రూ.6000 ఎకరానికి చొప్పున రైతులకు పెట్టుబడి సహాయం కింద అందచేస్తున్నారు.

తొమ్మిదో స్థానంలో హాలీవుడ్ కెప్టెన్ మార్వేల్ సినిమా మరియు ఎనిమిదో స్థానంలో జాక్విన్ ఫీనిక్స్ సినిమాలు ఉన్నాయి .అయితే డార్క్ నైట్ సినిమా లో ఉన్న జోకర్ క్యారెక్టర్ కి సంబంధించిన క్రేజ్ ఇప్పటికీ జనలో ఉందని అర్ధం చేసుకోవచ్చు .

ఎంబిబిఎస్ & బిడిఎస్ ప్రవేశ పరీక్ష అయిన నీట్ ఎగ్జాం రిసల్ట్స్ ఏడో స్థానంలో ట్రెండ్ అయ్యాయి .

భారతదేశం లో ఉన్న జమ్మూ & కాశ్మీర్ కు ఇప్పటిదాకా ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి ని రద్దు చేసే దిశగా కేంద్రం తీసుకువచ్చిన ఆర్టికల్ 370 గురించి జనం ఎక్కువగా వెతికారు. ఈ అంశానికి ఆరో స్థానం దక్కింది .

అవెంజర్స్ సిరీస్ లో వచ్చిన ద ఎండ్ గేమ్ సినిమా 5వ స్థానంలో ట్రెండ్ అయ్యింది. దీనికి కారణం అంతకుముందు వచ్చిన ఇన్ఫినిటీ వార్ సినిమా కు వచ్చిన హైప్మరియు సూపర్ విలన్ థానోస్ పాత్రకు వచ్చిన గుర్తింపే కారణం.

ఇక నాలుగో స్థానం మన తెలుగు దర్శకుడు తీసిన కబీర్ సింగ్ సినిమాకు దక్కింది. చంద్రుడిపై భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 మూడో స్థానంలో నిలిచింది. మొదట సక్సెస్ అనుకున్న ఆ ప్రయోగం చివరి నిమిషంలో ల్యాండింగ్ ముందు విక్రం లెండర్ లో తలెత్తిన సమస్య వల్ల కమ్యూనికేషన్ కోల్పోయింది.

రెండో స్థానంలో లోక్ సభ ఎన్నికలు, మొదటి స్థానంలో 2019 క్రికెట్ వరల్డ్ కప్ నిలిచాయి. మన టీం సెమి ఫైనల్ లో ఓడిపోయినా కానీ, క్రికెట్ మొదటి స్థానంలో నిలిచింది.

కాబట్టి, మన జనాలకి దేశంలో ఎన్నికల కన్నా క్రికెట్ ఇంపార్టెంట్ అని అర్ధం అవుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All