Homeఎక్స్ క్లూసివ్ఆస్కార్ అవార్డ్ కొట్టిన “పారసైట్ మూవీ” హైలెట్స్

ఆస్కార్ అవార్డ్ కొట్టిన “పారసైట్ మూవీ” హైలెట్స్

ఆస్కార్ అవార్డ్ కొట్టిన “పారసైట్ మూవీ” హైలెట్స్
ఆస్కార్ అవార్డ్ కొట్టిన “పారసైట్ మూవీ” హైలెట్స్

నాకు అవసరం అనిపించినంత వరకే సమాజంలో చట్టాలు,విలువలు,కట్టుబాట్లు. ఒకసారి వద్దు..! అని ఎవరికీ వారు అనుకుంటే ఆ తర్వాతి సెకండ్ నుండి ప్రపంచంలో కేవలం ఆకలి మాత్రమే మాట్లాడుతుంది. ఎవరికీ వారికి తమ స్వార్ధం కోసం ఏం చేసినా… న్యాయమే అనిపిస్తుంది. కొంచెం చదివి అర్ధం చేసుకోడానికి కఠినంగా ఉన్నా… మనం బ్రతికే సమాజం అసలు రంగు ఇది. మనిషి తను గోప్పోడిని అని చూపించుకోడానికి డబ్బుని తయారు చేసాడు.

తర్వాత తెలివి ఎక్కువై నకిలీ కరెన్సీని కూడా తయారు చేసాడు. కానీ ఆ డబ్బు మనిషి కంటే తెలివైనది. ప్రాణం లేని ఆ డబ్బు ప్రాణం ఉన్న మామూలు మనుషులను వాళ్ళకే తెలియకుండా నకిలీ మనుషులుగా మార్చేసింది. అదేవిధంగా తనకంటూ ఏబాష రాకపోయినా కూడా అబద్ధం చెప్పిస్తుంది. దొంగతనం, మోసం, కుట్ర, హత్య ఇలా అన్నీ చేయిస్తుంది. ఇప్పుడు ఆస్కార్ బరిలో ఉత్తమ సినిమాగా అవార్డు గెలుచుకున్న పారాసైట్ మూవీ కథ కూడా అదే.

- Advertisement -

ఒక పేద కుటుంబం. కుటుంబ పెద్ద తండ్రికి ఒక ధనవంతుల ఇంట్లో ఉద్యోగం వస్తుంది. ఆ ఒక్కడి సంపాదన తో వాళ్ళు సంతృప్తి పడితే సరిపోయేది. కానీ మిగిలిన ముగ్గురు కూడా ఆ పెద్దింట్లోకి, ఆల్రెడీ పని చేసే మిగిలిన వాళ్ళను మోసం చేసి వీళ్ళు పనిలో చేరతారు. ఆ ధనవంతుల కుటుంబం ఒకసారి టూర్ కి వెళ్ళినప్పుడు ఇక ఈ పేద ఫ్యామిలీ ఆ ఇల్లు తమదే అన్నట్లు ఎంజాయ్ చెయ్యడం మొదలెడతారు. ఇంతలో వీళ్ళ మోసం, వీళ్ళంతా ఒకటే కుటుంబం అనే నిజం అక్కడ పనిలోంచి తొలగించబడ్డ బ్యాచ్ కు తెలుస్తుంది. ఈలోపు టూర్ కి వెళ్ళిన అసలు రిచ్ ఫ్యామిలీ వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. సమాజంలో పేద – ధనిక తేడాలు మనుషులను ఎలా మార్చేస్తాయన్న కథ సినిమా చూస్తే తెలుస్తుంది.

మొదటిసారిగా ఆస్కార్ బరిలో ఉత్తమ చిత్రంగా, అది కూడా విదేశీ చిత్రంగా కాకుండా నేరుగా అవార్డు గెలుచుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా డైరెక్టర్ ఇప్పటికే కొరియన్ లాంగ్వేజ్ లో మెమరీస్ ఆఫ్ మర్డర్ లాంటి కల్ట్  సినిమాలు తీసిన “బాంగ్ జాన్ హో.” ఆయన టేకింగ్ & మేకింగ్ గురించి మరోసారి వివరంగా మాట్లాడుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All