Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ : బెస్ట్ అండ్ వరస్ట్ ప్లేయర్స్ టాస్క్ లో మరిన్ని వాదనలు

బిగ్ బాస్ : బెస్ట్ అండ్ వరస్ట్ ప్లేయర్స్ టాస్క్ లో మరిన్ని వాదనలు

jessie selected as worst player of the week in bigg boss 5
jessie selected as worst player of the week in bigg boss 5

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి రోజు నుండే ఆసక్తికరంగా మారింది. ఇందులో హౌజ్ మేట్స్ చాలా మందికి తెలీకపోయినా వారు తమ ఆటతీరుతో మెప్పిస్తున్నారు. అలాగే ఎప్పటిలానే బిగ్ బాస్ అంటే గొడవలు సాధారణం ఆ విషయంలో ఈ సీజన్ ఏ మాత్రం లోటు చెయ్యట్లేదు. మొదటి రోజు నుండే గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇక కెప్టెన్సీ టాస్క్ అయ్యాక నిన్నటి ఎపిసోడ్ లో వినాయక చవితి వేడుకలు జరిగాయి. ఆ తర్వాత బిగ్ బాస్ బెస్ట్ అండ్ వరస్ట్ ప్లేయర్స్ ను సెలెక్ట్ చేయమని కోరారు. ఇందులో ఎక్కువ మంది విశ్వను బెస్ట్ ప్లేయర్ గా, జెస్సీను వరస్ట్ ప్లేయర్ గా సెలెక్ట్ చేసారు. దీంతో జెస్సీ జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది. తదుపరి ఆదేశం వరకూ జెస్సీ జైల్లోనే గడపాలి.

- Advertisement -

ఈ టాస్క్ లోనే ఉమాకు ప్రియాకు వాదన జరిగింది. అది పర్సనల్ గా విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ప్రియా ఉమాకు సారీ చెప్పినా కానీ ఉమా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా హౌజ్ లో షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ్ చంద్ర, సన్నీ, శ్వేతా, ప్రియా వంటి వారు ఓపెన్ అవ్వలేదు. వీళ్ళకి పెద్దగా ఫుటేజ్ కూడా దొరకడం లేదు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో డేంజర్ లో ఉన్నది మాత్రం జెస్సీ, సరయు, హమీద అనే చెప్పాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All