Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: గొడవలు, అలకలు, ఏడుపులు

బిగ్ బాస్ 5: గొడవలు, అలకలు, ఏడుపులు

బిగ్ బాస్ 5: గొడవలు, అలకలు, ఏడుపులు
బిగ్ బాస్ 5: గొడవలు, అలకలు, ఏడుపులు

మూడో రోజు నుండే బిగ్ బాస్ లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. హౌజ్ మేట్స్ మధ్య సఖ్యత కొరవడింది. చూస్తుంటే ఎవరు కంటెంట్ కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరు జెన్యూన్ గా ఉన్నారో తెలుసుకోవడం కష్టంగానే ఉంది. బిగ్ బాస్ లో కొత్తగా పవర్ హౌజ్ కాన్సెప్ట్ ను మొదలుపెట్టారు. మొదటగా పవర్ హౌజ్ కు విశ్వకు యాక్సెస్ వచ్చింది. ఈ టాస్క్ లో భాగంగా ఎవరైనా ఇద్దరు ఇంటిసభ్యుల బట్టలు తీసేసుకుంటారు. వారు వ్యతిరేఖ జెండర్ బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. విశ్వ ఏమో ఈ టాస్క్ కోసం రవి, ప్రియాలను ఎంచుకున్నాడు. ఆ తర్వాత మానస్ కు ఈ యాక్సెస్ రాగా టాస్క్ ను ఆర్జే కాజల్ కు ఇచ్చాడు. దాని ప్రకారం అందరూ పడుకున్నాక కాజల్ పాడుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత వంటింట్లో లహరి, కాజల్ ల మధ్య గొడవ మొదలైంది. కేవలం కంటెంట్ కోసమే ఎక్కువ చేస్తున్నావంటూ కాజల్ ను టార్గెట్ చేసింది లహరి. యాని మాస్టర్, జెస్సీల మధ్య గొడవ కూడా పీక్స్ కు వెళ్ళింది. అయితే ఇందులో జెస్సీదే తప్పుగా అందరికీ అనిపించింది.

- Advertisement -

మరోవైపు సిరి, లోబో మధ్య ఫేక్ ఫైట్ అందరినీ టెన్షన్ పెట్టినా చివరికి నవ్వించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All