Homeటాప్ స్టోరీస్హార్ట్ ఎటాక్ తో చనిపోయిన బిగ్ బాస్ విన్నర్

హార్ట్ ఎటాక్ తో చనిపోయిన బిగ్ బాస్ విన్నర్

హార్ట్ ఎటాక్ తో చనిపోయిన బిగ్ బాస్ విన్నర్
హార్ట్ ఎటాక్ తో చనిపోయిన బిగ్ బాస్ విన్నర్

బిగ్ బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా తుదిశ్వాస విడిచారు. ఈ వార్త చాలా మందిని షాక్ కు గురిచేసింది. టివి సీరియల్స్, రియాలిటీ షోస్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో రూపొందిన హంప్తి శర్మకి దుల్హనియా చిత్రంలో నటించాడు సిద్ధార్థ్ శుక్లా. బిగ్ బాస్ 13లో సిద్ధార్థ్ పార్టిసిపేట్ చేయడమే కాదు అందరినీ డామినేట్ చేసి విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ తో తన పేరు మార్మోగిపోయింది.

ఝలక్ దిక్లాజా 6, ఫియర్ ఫ్యాక్టర్: కత్రోన్ కె ఖిలాడీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేసాడు ఈ బిగ్ బాస్ విన్నర్. సీరియల్స్ విషయానికొస్తే బాలిక వధు, దిల్ సే దిల్ తక్ వంటి వాటిలో నటించి పేరు తెచ్చుకున్నాడు.

- Advertisement -

40 ఏళ్ల సిద్ధార్థ్ శుక్లా తన ఇంట్లో రాత్రి మెడిసిన్ తీసుకుని పడుకుని, నిద్రలోనే మ్యాసివ్ హార్ట్ ఎటాక్ రావడంతో కన్నుమూశాడు. ముంబైలోని కూపర్ హాస్పిటల్ కు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. సిద్ధార్థ్ శుక్లా మరణ వార్త విని బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All