Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ దివికు అవకాశమిచ్చిన చిరు

బిగ్ బాస్ దివికు అవకాశమిచ్చిన చిరు

బిగ్ బాస్ దివికు అవకాశమిచ్చిన చిరు
బిగ్ బాస్ దివికు అవకాశమిచ్చిన చిరు

చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అవకాశాలు ఇస్తున్నారు. నాగార్జున ఇప్పటికే అలీ రెజాకు అవకాశమిచ్చాడు, అలాగే మోనాల్ కు తన నెక్స్ట్ సినిమాలో అవకాశమిస్తున్నాడు. చిరంజీవి కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద దివికి తన నెక్స్ట్ సినిమాలో అవకాశమిస్తానని తెలియజేసాడు. అన్నట్లుగానే మాట మీద నిలబడి తనకు అవకాశమిచ్చాడు.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వరసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయ్యాయి. అదే కోవలో అనౌన్స్ అయిన చిత్రం భోళా శంకర్. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ దివికి అవకాశమిచ్చాడట చిరు.

- Advertisement -

ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. మరి దివి ఎలాంటి పాత్రను చేస్తోంది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ తర్వాత దివికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఆమె హీరోయిన్ గా ఒక చిత్రాన్ని పూర్తి చేసింది. ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All