Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: మరోసారి గొడవలు, ఈసారి సరదాలు కూడా

బిగ్ బాస్ 5: మరోసారి గొడవలు, ఈసారి సరదాలు కూడా

బిగ్ బాస్ 5: మరోసారి గొడవలు, ఈసారి సరదాలు కూడా
బిగ్ బాస్ 5: మరోసారి గొడవలు, ఈసారి సరదాలు కూడా

టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ఈసారి మొదటి ఎపిసోడ్ నుండే గాడిలో పడింది. ప్రేక్షకులకు ఏం కావాలో అది అందిస్తూ ముందుకు వెళుతోంది. మొదలైన తొలిరోజు నుండే కంటెస్టెంట్ ల మధ్య గొడవలు, సరదాలు మొదలైపోయాయి. నిన్నటి ఎపిసోడ్ లో కూడా మరోసారి గొడవలు హెచ్చుమీరాయి. అయితే దానికి తగ్గ రేంజ్ లోనే ఎంటర్టైన్మెంట్ కూడా పండింది.

మొదటి ఎపిసోడ్ నుండే అందరినీ ఎంటర్టైన్ చేస్తోన్న లోబో నిన్న కూడా మంచి కామెడీ పంచాడు. హౌజ్ లో కొంత మంది కంటెస్టెంట్స్ ను ఇమిటేట్ చేసి లోబో అందరినీ నవ్వించాడు. హౌజ్ మేట్స్ కూడా దీన్ని సరదాగా తీసుకున్నారు. అలాగే నిన్న బాగా హైపర్ అయిన జెస్సీ ఈరోజు అన్నీ మాస్టర్ కు సారీ చెప్పాడు. అన్నీ మాస్టర్ కూడా అతని క్షమాపణను స్వీకరించింది.

- Advertisement -

ఇక లహరి తన గొడవల పద్దతిని కంటిన్యూ చేస్తోంది. నిన్న కాజల్ ను కంటెంట్ కోసం ప్రయత్నిస్తున్నావని గొడవ చేసిన లహరి ఈసారి హమీదను టార్గెట్ చేసింది. హమీద ఏడుపు అందుకోవడంతో శ్రీరామ్ చంద్ర ఆమెను ఓదార్చే పని పెట్టుకున్నాడు. ఇంకా షణ్ముఖ్ జస్వంత్, ప్రియా, సరయు వంటి వారు పూర్తిస్థాయిలో ఓపెన్ అవ్వట్లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All