
సైలెంట్‌గా ఇంకా చెప్పాలంటే అండర్ డాగ్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం `జాతిరత్నాలు`. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫరీయా అబ్దుల్లా హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిత్రాన్ని అనుదీప్ కె.వి. దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన విషయం తెలిసిందే.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించి ఇప్పటికే 50 కోట్ల క్లబ్‌ని దాటేసి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. ఈ మూవీ విడుదలై 20 రోజులు కావస్తున్నా కలెక్షన్‌ల పరంగా ఎక్కడా తగ్గడం లేదు. వరల్డ్ వైడ్‌గా 20 రోజులకు ఏకంగా 62.86 కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 20 రోజుల్లో వసూలు చేసిన వివరాలిలా వున్నాయి.
నైజాం : 15.83 కోట్లు
సీడెడ్: 4.23 కోట్లు
ఉత్తరాంధ్ర : 3.92 కోట్లు
ఈస్ట్ గోదావరి: 1.91 కోట్లు
గుంటూరు: 2.06 కోట్లు
కృష్ణా : 1.81 కోట్లు
నెల్లూరు: 90 లక్షలు
ఏపీ , తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 32.16 కోట్లు (51.52 కోట్ల గ్రాస్)
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.60 కోట్లు
ఓవర్సీస్ : 4.16 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ 20 డేస్ కలెక్షన్స్ ఐ 37.92 కోట్ల షేర్ (62.86 కోట్ల గ్రాస్)