
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుంటూరు జిల్లా పత్తిపాడులో ఖాళీ అయ్యింది. జనసేన ఆఫీసు ముందు పెట్టిన టు లెట్ బోర్డు దర్శనం ఇచ్చింది, దాంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన పార్టీ ఆఫీసు ఖాళీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గుంటూరు జిల్లా పత్తిపాడు నుండి జనసేన తరుపున మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పోటీచేసి దారుణంగా ఓడిపోయాడు.
తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు కు చంద్రబాబు షాకిచ్చాడు మంత్రి పదవి తీసేసి దాంతో అవమానంగా భావించిన కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసాడు కానీ పవన్ కళ్యాణ్ తో సహా 174 మంది ఓడిపోయారు. దాంతో ఖంగుతిన్న రావెల జనసేన పార్టీకి రాజీనామా చేసాడు.
రావెల కిషోర్ బాబు రాజీనామా చేయడంతో జనసేన పార్టీ కార్యాలయానికి మూతపడింది. దాంతో ఆ భవనం యజమాని టు లెట్ బోర్డు పెట్టాడు. మద్యం షాపులకు బాగుంటుంది ఈ అడ్డా అని చెప్పడం విశేషం.