Homeటాప్ స్టోరీస్“సమయం లేదు మిత్రమా...!” అంటున్న జేమ్స్ బాండ్

“సమయం లేదు మిత్రమా…!” అంటున్న జేమ్స్ బాండ్

James bond NO TIME TO DIE movie
James bond NO TIME TO DIE movie

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగ్ ఇది… “సమయం లేదు మిత్రమా..! శరణమా..? రణమా?” . ఇప్పుడు అలాంటి లైన్ ను హాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ అయిన జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ లో 25వ సినిమా వస్తోంది. ఆ సినిమా పేరు “నో టైం టూ డై”. ఇక జేమ్స్ బాండ్ గా మళ్ళీ డానియల్ క్రేగ్ నటించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

జేమ్స్ బాండ్ అంటే జనాలకు గుర్తుకు వచ్చేది ఆయన సినిమాల్లో చేసే స్టంట్స్, జేమ్స్ బాండ్ వాడే కార్లు, జేమ్స్ బాండ్ గర్ల్ ఫ్రెండ్స్.ఇక 007 అనే వ్యక్తి అటు టెక్నాలజీ ని, ఇటు కార్లను, మరో వైపు అమ్మాయిలను కూడా ఎంతో ఈజ్ తో హ్యాండిల్ చేస్తూ, ప్రపంచానికి రాబోయే ఎన్నో అపాయాల నుండి కాపాడుతూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో కూడా విచిత్రమైన ముసుగు వేసుకుని వెంటాడే విలన్, మోసం చేసి వెళ్ళిపోయే హీరోయిన్, ఎప్పుడూ కవ్వించే గర్ల్ ఫ్రెండ్స్, జరగబోయే ప్రమాదం తెలియకుండా ప్రవర్తించే టీం, జేమ్స్ కి హెల్ప్ చేసే వారు కొందరు, మోం చేసే వాళ్ళు కొందరు… ఇలా మొత్తానికి ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉండబోతున్నట్లు మను చూపించిన ట్రైలర్ లో ఉన్నాయి. ఇక ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే సినిమా పై ఇప్పటికే ఎన్నో స్పాయిలర్ అలర్ట్స్ నెట్ లో షికార్లు చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All