Homeటాప్ స్టోరీస్‘క్యాష్ క్యాష్’ చిత్రం లోని నోట్లరద్దు గీతాన్ని విడుదలచేసిన దర్శకుడు ‘బాబీ’

‘క్యాష్ క్యాష్’ చిత్రం లోని నోట్లరద్దు గీతాన్ని విడుదలచేసిన దర్శకుడు ‘బాబీ’

demonetisation-song-cash-cash
తమిళంలో ‘థట్రోమ్ థూక్రోమ్’ పేరుతో రూపొందుతున్న  చిత్రమ్ ‘క్యాష్ క్యాష్’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. మీడియా మార్షల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు  అరుళ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో  మొదటి సింగిల్ ‘డిమోనిటైజెషన్ సాంగ్’ ను దర్శకుడు బాబీ ఈ రోజు  విడుదల చేసారు.
ఈ సందర్భంగా దర్శకుడు అరుళ్ కుమార్ మాట్లాడుతూ “ఈ పాట తమిళంలో ఒక ఉద్రేకంతో జనంలోకి వెళ్ళింది. అలాగే తెలుగు ప్రేక్షకులను ఈ పాట అలాగే ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ పాటను లాంచ్ చేసినందుకు  స్టార్ డైరెక్టర్ బాబీగారికి నా ధన్యవాదాలు” అని అన్నారు.
అనంతరం దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ఈ పాట వినగానే నోట్ల రద్దు సమయంలో ఎదుర్కొన్న కొన్ని వాస్తవిక పరిస్థితులను గుర్తుకు తెచ్చింది. అలాగే  ప్రజలు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించిన పద్ధతి నన్ను  చాలా బాగా ఆకర్షించింది. ఈ సినిమా కోసం  నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.
ఈ చిత్ర సంగీత దర్శకుడు డిజే వసంత్ మాట్లాడుతూ.. ‘నేను సంగీత దర్శకుడిని అయినా..  తెలుగులో మొట్టమొదటి సారిగా ఈ సినిమా కోసం ఈ పాట రాశాను. ఈ చిత్రబృందం ఓ గీత రచయిత ఉంటే చెప్పండి అని నన్ను అడిగారు. నోట్ల రద్దు టైంలోని పరిస్థితుల గురించి పాట రాయాలి అన్నప్పుడు.. అప్పటి పరిస్థితులు ఎదుర్కున్న వాడిగా  నేనెందుకు ఈ పాట రాయకూడదు అనిపించింది. అలా ఈ పాటను రాసాను. బాగా వచ్చింది. మీరందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను’ అని చెప్పారు.
కాగా ఈ సాంగ్ ను తమిళ్ హీరో శింబు పాడారు. మ్యూజిక్ సెన్స్ ఉన్న శింబు ఈ పాట పాడటం వల్ల పాట చాలా బాగా వచ్చింది.  ముందుగా ఈ సినిమా నుండి  ప్రతిష్టాత్మక గీతంతో ప్రమోషన్స్ ను మొదలు పెట్టడం ఆనందంగా ఉందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ఇక ఈ  క్రేజీ క్రైమ్  థ్రిల్లర్ మూవీ…  ‘జీవితంలో ఎదగాలి  పెద్దగా డబ్బు సంపాదించాలనుకునే  ముగ్గురు అబ్బాయిల చుట్టూ తిరిగే కథ’.  ఈ సినిమా ముఖ్యంగా  భారత్ లోని ప్రజలు డిమానిటైజెషన్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.  ఆ సమయంలో సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు?  అనే నేపధ్యంలో ఈ చిత్రం సాగనుంది. త్వరలో ఈ చిత్రం విడుదల తేదీ మరియు చిత్రం యొక్క ఇతర వివరాలు తెలియనున్నాయి.
క్యాష్ క్యాష్  మూవీ తారాగణం & సాంకేతిక విభాగం :
నటీనటులు: టీజాయ్, శక్తివేల్ కాల్కానా, నందు సురేష్, చీను మోహన్, మారిమత్తు, కాళి వెంకట్
నిర్మాత-దర్శకుడు: అరుళ్.ఎస్
సంగీతం: బాలమురళి బాలు
కెమెరామెన్ : ఎన్ సతీష్ మురుగన్
ఎడిటర్ : సుధృష్ణన్
పాటలు & సంభాషణలు: కబీలన్ వైరమత్తు
బ్యానర్: మీడియా మార్షల్
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All