Homeటాప్ స్టోరీస్డియర్ టాలీవుడ్... ! నిజమైన హీరోఇజం చూపించడానికి సిద్ధమా.?

డియర్ టాలీవుడ్… ! నిజమైన హీరోఇజం చూపించడానికి సిద్ధమా.?

డియర్ టాలీవుడ్... ! నిజమైన హీరోఇజం చూపించడానికి సిద్ధమా.?
డియర్ టాలీవుడ్… ! నిజమైన హీరోఇజం చూపించడానికి సిద్ధమా.?

విపత్కర పరిస్థితులు మాత్రమే నిజమైన ఆత్మీయులను మనకు తెలియజేస్తాయి అన్న పెద్దల మాట అక్షరాలా నిజం. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారతదేశవ్యాప్తంగా తీసుకున్న నివారణ చర్యల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించాయి. ఈనెల 31 వరకు అత్యవసర సేవలు,సర్వీసులు వైద్యము,రక్షణ,అగ్నిమాపక సేవలు ఇతర అత్యవసర సేవలు మినహా అన్నీ నిలిపివేస్తునట్లుగా ప్రజలందరినీ కూడా ఇళ్ల వద్దే ఉండి స్వీయ నిర్బంధంలో ఉండవలసిందిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలుగు చిత్ర పరిశ్రమ ఈ నెల 31వ తేదీ వరకు అన్ని రకాల సినిమాల షూటింగ్ లు, రిలీజ్ లు, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీప్రొడక్షన్ ప్రమోషన్ ఇతర కార్యక్రమాలు అన్నీ వాయిదా వేశారు.

ఉపాధి కోల్పోయి ఇబ్బందిపడుతున్న ఎంతో మంది సినీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల పై ఉన్నది. ఒక సినిమా నిర్మాణం మరియు అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రజల మధ్య కి రావాలి.. అంటే; దాని వెనక ఎంతో వందల వేల మంది కార్మికుల శ్రమ ఉంటుంది.  సినిమా పరిశ్రమలో ఎంతోమంది అసంఘటిత కార్మికులు 24 విభాగాలకు చెందిన టువంటి కార్మికులు సినిమా పరిశ్రమ పైన ఆధారపడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఎంతోమంది చిరు వర్తకులు వ్యాపారులు కూడా ఉంటారు.

- Advertisement -

ఇక వీరందరికీ ఉపశమన చర్యలు కలిగించాల్సిన బాధ్యత సినిమా పరిశ్రమ మీద ఉంది.  ముఖ్యంగా ప్రతిరోజూ షూటింగ్ లేదా సినిమా సంబంధించిన కార్యక్రమం జరిగితే తప్ప ఉపాధి దొరకని కార్మికులకు వెంటనే ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించవలసిన బాధ్యత కూడా పరిశ్రమ పైన ఉంది. సినిమాలను చూసే ప్రేక్షకులు దేవుళ్ళు అయితే సినిమా తయారవటానికి కష్టపడే కార్మికులు ఆ దేవుడి కంటే గొప్ప. కాబట్టి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పైన ఉంది.  ఇప్పటికే సినీ నటులు రాజశేఖర్ గారు మరియు జీవిత గారు పది రోజులపాటు సినిమా కార్మికులకు సహాయం చేస్తానని ప్రకటించారు. ఇంకా అనేకమంది ఇండస్ట్రీ పెద్దలు తమ దగ్గర పనిచేసే… తమ సినిమాలకు, ప్రాజెక్ట్ లకు పనిచేసే సిబ్బందికి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All