Homeన్యూస్చిత్ర పరిశ్రమ సంక్షేమమే మా లక్ష్యం... - సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని

చిత్ర పరిశ్రమ సంక్షేమమే మా లక్ష్యం… – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని

Cinematography minister has come up with our aim - film industry welfareతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ బాగుండేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. ఇక్కడ పెద్దా చిన్నా బేధం లేదని…అందరూ ఎవరి స్థాయిలో వారు గౌరవంగా బతికేలా చూస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరక్టర్స్ అసోసియేషన్ నూతన భవన భూమి పూజా కార్యక్రమంలో తలసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, ఎంఐఎం సీనియర్ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్, చిత్రపురి హిల్స్ అండ్ ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కొమర వెంకటేష్, ఫిల్మ్ ఫెడరేషన్ సెక్రటరీ బందరు బాబీ, ఎంఐఎం నాయకులు నవీన్ యాదవ్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

భూమి పూజా కార్యక్రమం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ…చిత్ర పరిశ్రమలో కొందరు స్వార్థం కోసం రకరకాల యూనియన్ లు పెట్టుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు విడిపోతే ఐఖ్యత ఉండదు. ఒకే యూనియన్ ఉండాలి. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరక్టర్స్ అసోసియేషన్ ను ప్రభుత్వం గుర్తిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్లకు లేని వాళ్లకు మధ్య అంతరం అలాగే ఉండిపోతోంది. స్థాయిలు మరచి ప్రతి ఒక్కరు గౌరవంగా బతకాలన్నది మా ప్రభుత్వ ఆలోచన. మా దృష్టిలో అందరూ సమానమే. చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమంగా ఉండి స్థిరపడేందుకు సహకారం అందిస్తాం. డాన్సర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి నా వంతు ఐదు లక్షల రూపాయలు సాయం ప్రకటిస్తున్నాను. కాదంబరి కిరణ్ మనం సైతం అంటూ గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సంస్థకు కూడా ఐదు లక్షల రూపాయలు సహాయం అందించాము. అన్నారు.

- Advertisement -

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…25 ఏళ్ల మా కల ఇవాళ నెరవేరుతోంది. మా సంఘానికి సొంత భవనం ఉండాలన్నది ముక్కు రాజు గారి కోరిక. ఆయన లక్ష్యం ఇవాళ నిజమయింది. మా జీవితాలు బాగు పడాలంటే ప్రభుత్వం ఎక్కడైనా మాకు ఇంటిస్థలం కేటాయించాలని కోరుకుంటున్నాం. పరిశ్రమకు వచ్చి ఇన్నేళ్లుగా బతుకుతున్నందుకు మా కుటుంబం ఉండేందుకు నీడ కల్పించిన వారమవుతాం. ప్రభుత్వం ఈ విషయంలో సహాయం చేయాలని కోరుతున్నాం. అన్నారు.

మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ….మన డాన్సర్లకు ఇవాళ గొప్ప పండగ రోజు. అలనాటి నాయకులు ముక్కు రాజు నుంచి ఇప్పటి సంఘ నాయకుల కృషితో సొంత భవన నిర్మాణం జరుపుకుంటున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ గారు సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాక డాన్సర్స్ యూనియన్ సమస్యలను తీర్చారు. సంఘంలోని అందరినీ ఒక్కతాటి మీదకు తీసుకొచ్చారు. డాన్సర్లకు ఇదొక్క యూనియన్ మాత్రమే ఉంటుంది అనే చెప్పేంత గుర్తింపు తీసుకొచ్చారు. మా ఇంటి పెద్దగా సమస్యలు తీర్చే మంత్రి ఉండటం చిత్ర పరిశ్రమ అదృష్టంగా భావిస్తున్నాం. మనం సైతంకు ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చి మా సేవా కార్యక్రమాలకు అండగా నిలబడ్డారు.అన్నారు.

English Title : Cinematography minister aim film industry welfare

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All