Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ కు నయనతార సినిమాకు లింకేంటి ?

విజయ్ దేవరకొండ కు నయనతార సినిమాకు లింకేంటి ?

Is Taxiwala copy from Nayanatara's Doraవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీ వాలా చిత్రం ఈనెల 16 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఆ సినిమాకు నయనతార నటించిన డోరా సినిమాకు కాస్త పోలికలు అయితే కనబడుతున్నాయి . రెండు కూడా కార్ల నేపథ్యం అలాగే కుక్క ……. ఇంకా చెప్పాలంటే దెయ్యం కథ ఇలా మొత్తంగా కొన్ని అంశాలైతే నయనతార డోరా కు విజయ్ దేవరకొండ టాక్సీ వాలా కు దగ్గరి పోలికలు కనబడుతున్నాయి . దాంతో ఈ చర్చ మొదలయ్యింది . నయనతార నటించిన డోరా వెండితెర మీద టాలీవుడ్ లో అంతగా ఆడలేదు తమిళ్ లో ఆడింది అయితే టాలీవుడ్ లో బుల్లితెర పై మాత్రం పెద్ద విజయమే సాధించింది డోరా .

కట్ చేస్తే ఇప్పుడు విజయ్ దేవరకొండ టాక్సీ వాలా విడుదల అవుతోంది . మరో రెండు రోజుల్లో టాక్సీ వాలా విడుదల అవుతున్న నేపథ్యంలో నయనతార సినిమాకు విజయ్ దేవరకొండ సినిమాకు లింక్ పెట్టి మాట్లాడుతున్నారు . అయితే ఏ సినిమా ప్రత్యేకత ఆ సినిమాదే ! కాకపోతే టాక్సీ వాలా విడుదల అయితే కానీ అసలు విషయం తెలీదు డోరా ని స్వల్ప మార్పులు చేసి తీసారా ? లేక యాదృచ్చికంగా కొని అంశాలు మాత్రమే కలిసాయా ? అన్నది . టాక్సీ వాలా సినిమా మొత్తం ముందే లీక్ కావడంతో ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు . కాకపోతే విజయ్ కున్న క్రేజ్ తో ఓపెనింగ్స్ వస్తాయి , ఇక సినిమా బాగుంటే హిట్ లేకపోతే మరో నోటా అవుతుంది .

- Advertisement -

English Title: Is Taxiwala copy from Nayanatara’s Dora

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All