Homeటాప్ స్టోరీస్అరవింద సమేత కథ మిర్చి కథ ఒకటేనా?

అరవింద సమేత కథ మిర్చి కథ ఒకటేనా?

Is ntr's Aravinda sametha copied from prabhas's mirchiయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ ఈనెల 11న భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కాగా నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది ఈ చిత్రం. ఇక అరవింద సమేత వీర రాఘవ కథ విషయానికి వస్తే ప్రభాస్ నటించిన మిర్చి కథ కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా అరవింద సమేత ట్రైలర్ కూడా అదే హింట్ ఇస్తోంది కూడా. యుద్ధం చేయడం గొప్ప కాదు యుద్ధం ఆపడం గొప్ప ..యుద్ధం ఆపేవాడే గొప్పవాడు అనేది వీర రాఘవ స్టైల్ కాగా రాయలసీమలో కత్తులు పట్టి రక్తపుటేరులు పారేలా చేయొద్దని , కత్తి పట్టడం మొదలు పెడితే నాకంటే ఎవ్వడు బాగా వాడలేడు అన్నది ప్రభాస్ మిర్చి కథ. అలాగే మిర్చిలో కూడా హీరోయిన్ కోసం రాయలసీమలో అడుగుపెడతాడు హీరో , తన మూలాల అక్కడే ఉన్నాయని తెలుసుకొని వాళ్ళని మార్చడానికి ప్రయత్నాలు చేస్తాడు . ఇక అరవింద లో కూడా సేమ్ టు సేమ్ అని వినిపిస్తోంది.

అయితే యాజిటీజ్ గా కథ , కథనం ఉండదు , త్రివిక్రమ్ తరహా కామెడీ , యాక్షన్ ఉంటాయి అదే తేడా ! పూర్తిగా ఇదే అని చెప్పలేం కానీ అరవింద ట్రైలర్ చూసినా మిర్చి కథ గుర్తుకు చేసుకున్నా ఒకేలా అనిపిస్తోంది అందుకే మిర్చి కథ నే కాస్త అటు ఇటు గా మార్చారని అంటున్నారు. ఈ కాపీ కథల విషయం పక్కన పెడితే అరవింద సమేత దసరా బరిలో కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ -ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

English Title: Is ntr’s Aravinda sametha copied from prabhas’s mirchi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts