Homeటాప్ స్టోరీస్కొత్త బిజినెస్ మొదలు పెట్టిన ప్రభాస్

కొత్త బిజినెస్ మొదలు పెట్టిన ప్రభాస్

prabhas entered in new businessయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు . తన మిత్రులైన యువి క్రియేషన్స్ భాగస్వామ్యంతో ఈ బిజినెస్ మొదలు పెట్టాడు . ఇంతకీ ప్రభాస్ స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ ఏంటా ? అనే కదా మీ డౌట్ ? థియేటర్ ల లీజు . ఇంతకుముందే యువి క్రియేషన్స్ చేతిలో కొన్ని థియేటర్ లు , మల్టీప్లెక్స్ లు ఉండగా తాజాగా దాన్ని మరింతగా విస్తృతం చేయాలనీ డిసైడ్ అయ్యారట ! రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని థియేటర్ లను లీజు కి తీసుకోవడం కానీ కొనడం కానీ చేసి వాటి రూపురేఖలు మార్చేసి కొత్త కొత్త సినిమాలను అందులో ప్రదర్శించాలని చూస్తున్నారు . ఎలాగూ ప్రభాస్ తో పాటుగా మిగతా వాళ్ళు కూడా సినిమారంగంలోనే ఉన్నారు కాబట్టి మనకు తెలిసిన బిజినెస్ నే చేస్తే బాగుంటుందని ఇందులో దిగారట !

ప్రభాస్ ఎలాగూ సినిమాల్లో నటిస్తున్నాడు అలాగే యువి క్రియేషన్స్ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మిస్తున్నారు దానికి తోడు కొన్ని సినిమాలను ఏరియాల వారీగా కొంటూ పంపిణీ చేస్తున్నారు అందుకే థియేటర్ ల లీజు కి దిగారు ప్రభాస్ అండ్ కో . బాహుబలి చిత్రాలతో ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగింది , దాంతో పెద్ద ఎత్తున డబ్బులు వచ్చిపడుతున్నాయి అందుకే ఇలా ఆ డబ్బుని పెట్టుబడులుగా పెడుతున్నారు . ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంతో బిజీ గా ఉన్నాడు .

- Advertisement -

English Title: prabhas entered in new business

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All